అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
రాము, రమణిల పెళ్లి రోజు, రమణి ఆ సాయంత్రం రాము కోసం ఎదురు చూస్తోంది, అన్యోన్యంగా ఉన్న ఆ జంట, కొన్నేళ్లకు వారి మధ్య కొట్లాటలు కోపతాపాలతో కొంత దూరం ఏర్పడింది. ఈ పొరపొచ్చాలు రావడం ఇద్దరికీ ఇష్టం లేదు. రాముకు ఆ రోజు పెళ్లి రోజు అని గుర్తుందో లేదో అని రమణి
ఆలోచిస్తోంది, తలుపు చప్పుడైంది, చిరునవ్వు చిందిస్తూ రాముకు ఎదురెళ్ళింది. ఇద్దరూ పెళ్లి రోజు ఆనందంగా పండగ చేసుకుంటున్నారు.
హాల్ లో ఉన్న ఫోన్ మోగింది. రమణి పరుగున ఫోన్ అందుకునింది. “హలో! నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను, రాము అనే వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయాడు.
జేబులో ఉన్న ఐడి కార్డు తో గుర్తించాం! రాము మీకేమవుతారు “రమణి దిగ్భ్రాంతి చెంది, రాము ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడే”, “క్షమించండి మేడం రాము బస్సు దిగుతూ కింద పడి చనిపోయాడు” ఆశ్చర్య పోయి, బెడ్ రూమ్ కి వెళ్లి చూస్తే రాము అక్కడ లేడు. ఏమయ్యాడు? తను దెయ్యాలు భూతాల కథలు చాలానే చదివింది!
చనిపోయిన తర్వాత ఇష్టమైన వాళ్లను దయ్యాల రూపంలో కలుసుకోవడం వంటి కథలు వినింది, రాము కనిపించకపోయే సరికి దుఃఖంతో కుప్పకూలిపోయింది. అంతలో బాత్ రూమ్ నుండి రాము, “రమణీ! నా పర్స్ ఎవరో కొట్టేశారు!” అన్నాడు నవ్వుతూ.
జీవించడానికి మనకు రెండో అవకాశం లేదు, సంబంధాలు బాంధవ్యాలకి విలువ ఇవ్వండి. కలిసిమెలిసి అద్భుతమైన జీవితం గడపండి. రేపు అన్నది నిజంకాదు కదా! ఈ రోజే ఈ క్షణమే ఆనందమైన జీవితాన్ని గడపండి.
సేకరణ – V V S Prasad