ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చిన్న పిల్ల నేర్పిన పాఠం – Telugu Short Stories
ఓ రోజు నేను పార్క్ లో నడిచి పోతుంటే నా ముందు తల్లీ, ఆమె మూడేళ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో బెలూన్. అకస్మాత్తుగా గట్టి గాలి వీచి, ఆ అమ్మాయి చేతిలోని బెలూన్ ఎగిరిపోయింది. ఆ పాప ఏడుస్తూ, బెలూన్ పోయిందని మారాం చేస్తుందనుకున్నాను. అమ్మాయి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ “వావ్” అంటూ గంతులేసింది. అనుకోకుండా ఆ క్షణం ఆ అమ్మాయి, నాకొక పాఠం నేర్పింది.
నా లైఫ్ లో అనుకోని సంఘటన జరిగిందని ఆ సాయంత్రం తెలిసింది. అది విని పిచ్చి కోపంతో చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టాలనిపించింది. అంతలో పొద్దున గాలిలో ఎగిరిపోతున్న బెలూన్ చూసి ఆ అమ్మాయి “వావ్” అనడం గుర్తొచ్చి, నన్ను నేను అదుపులో పెట్టుకొని, “వావ్ !!! చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఇప్పుడు నేనేం చేయాలి!” అంటూ నవ్వుతూ అడిగాను. ఒక్క విషయం మాత్రం నిజం – అనుకోని సంఘటనలు, సమస్యల వల్ల జీవితాలు ఎగుడుదిగుడులకు లోనౌతాయి. అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం? మనం చిరాకు పడి విసుగు, కోపం తెచ్చుకోవచ్చు. లేదా దాన్ని “వావ్” అనుకొని
సవాలుగా తీసుకుని సంతోషంగా ఎదుర్కోవచ్చు.
పరిస్థితులు ఏమైనా గానీ, ఒక “వావ్” భారాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఎదురైతే పార్క్ లో అమ్మాయిని తలచుకొని “వావ్” అనుకోండి.
సేకరణ – V V S Prasad