అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
నీవు చెయ్యలేవు, నీకు చేతకాదు అని భయపెట్టే వాళ్ళకి దూరంగా వుండు – Telugu Short Stories
ఒక ఊళ్ళో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. పెద్దాడికి 10, చిన్నోడికి 6 ఏళ్ళు. ఒక రోజు ఊరిబయట ఆడుకుంటుండగా, పెద్దాడు జారి బావిలో పడిపోయాడు. పెద్దగా కేకలు వేస్తున్నాడు రక్షించమని. ఇది చూసి నిజంగానే చిన్నోడు భయపడి పోయాడు. సన్నగా, బక్కపల్చగా ఉంటాడు.
అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. చిన్నోడు చుట్టూ చూసాడు. అక్కడ ఒక తాడు, దానికి కన ఒక బకెట్ కనబడ్డాయి. బలమంతా ఉపయోగించి ఆ తాడును తీసుకొచ్చి, బకెట్ ఉన్న వైపు బావిలోకి వదిలాడు, రెండో వైపు తను పట్టుకున్నాడు. పెద్దాడు బావిలో బకెట్ పట్టుకున్నాడు. చిన్నోడు తాడు పట్టుకుని, చేతులు బొబ్బలెక్కుతున్నా, కాళ్ళు నేల మీద నిలవకున్నా ఒదలకుండా, పెద్దాడిని అతి కష్టమ్మీద బయటికి లాగాడు.
పెద్దవాళ్ళు తిడతారని భయపడి ఊళ్ళో ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఆశ్చర్య పోయారు. ఒక పెద్ద మనిషిని అడిగారు, “అదెలా సాధ్యం !” “ఆ పిల్లవాడు చెప్పింది అతి సామాన్యమైన విషయం. నిజమే బావి లోనుండి పెద్దాడిని ఈ చిన్నోడు రక్షించాడు.” అన్నాడు పెద్ద మనిషి.
ఊళ్ళో వాళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు. “ఎందుకంటే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. నీవు చెయ్యలేవు, నీకు చేతకాదు, అది చాలా కష్టం. అని భయపెట్టే వాళ్ళు లేరు. అందుకే పెద్దడిని రక్షించ గలిగాడు.”
పరిమితులు, భయాలు మన మనస్సుల్లోనే ఉంటాయి. సర్వశక్తులు మీలోనే ఉన్నాయి. మీరు చెయ్యగలరు అనుకుంటే చెయ్యగలరు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
సేకరణ – V V S Prasad