ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu, Telugu Short Stories
చాలా కాలం క్రితం మన దేశంలోని ఒక దేవాలయాన్ని దర్శించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడ ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కుతూ కనిపించాడు. అటువంటిదే మరొక విగ్రహం పక్కన కనిపించింది. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, “ఒకే రకమైనవి రెండు విగ్రహాలు కావాలా” అని అడిగాడు.
శిల్పి తలపైకి ఎత్తకుండా, “ఒకటే కావాలి కానీ ఆ మొదటి దాంట్లో ఒక లోపం వచ్చింది. ముక్కు దగ్గర చిన్న పగులు ఏర్పడింది” అన్నాడు శిల్పి. కనిపించీ కనిపించకుండా ఉన్న ఆ చిన్న లోపాన్ని చూసి, “ఈ విగ్రహాన్ని ఎక్కడ నెలకొల్పుతారు !” అని అడిగాడు.
“అదుగో ఆ పైన, గోపురం మీద 20 అడుగుల ఎత్తున” “అంత పైన ఉన్న ఈ విగ్రహం ముక్కు మీద ఉన్న చిన్న లోపం ఎవరు చూస్తారు! ఎవరికి కనిపిస్తుంది.” ఆశ్చర్యంగా అడిగాడా ఆగంతకుడు. శిల్పి తన పని ఆపి, ఆ ఆగంతకుడితో, “నాకు కనిపిస్తుంది, నాకు లోపం ఎక్కడ ఉందో తెలుసు.”
ప్రతిభావంతంగా పని చేయడం ఒక ప్రత్యేక లక్షణం. ఒక అలవాటు. దానికి ప్రశంసలతో సంబంధం లేదు. ప్రతిభావంతంగా చేయాలని వుండాలి. ఎవరో నాలాంటి వాళ్ళు చెప్తే రాదు. ప్రతిభ ఎవరి గుర్తింపుకో కాదు. అది మన ఆత్మ సంతృప్తికి, మన సామర్థ్యానికి గీటురాయి.
సేకరణ – V V S Prasad