అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
భరించేది భార్య,
బ్రతుకునిచ్చేది భార్య,
చెలిమినిచ్చేది భార్య
చేరదీసేది భార్య,
ఆకాశాన సూర్యుడు లేకపోయినా…
ఇంట్లో భార్య లేకపోయినా
అక్కడ జగతికి వెలుగుండదు.
ఇక్కడ ఇంటికి వెలుగుండదు
భర్త వంశానికి సృష్టికర్త,
మొగుడి అంశానికి మూలకర్త,
కొంగు తీసి ముందుకేగినా…
చెంగు తీసి మూతి తుడిచినా…ముడిచినా
తనకు లేరు ఎవరు సాటి ఇలలో…
తను లేని ఇల్లు… కలలో….
ఊహకందని భావన…
బిడ్డల నాదరించి…
పెద్దల సేవలో తరించి
భర్తని మురిపించి…మైమరపించి…
బ్రతుకు మీద ఆశలు పెంచి…
చెడు ఆలోచనలు త్రుంచి…
భ్రమరంలా ఎగురుతూ…
భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ…
కళ్ళు కాయలు కాచేలా…
భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన
జీతం లేని పని మనిషి…
జీవితాన్ని అందించే మనసున్న మనిషి…
ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం,
ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప
అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం
కొసమెరుపు
ఆమెకు ఆమే సాటి..
Telugu Poetry about Wife