ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఘల్లు ఘల్లు న మోగే అందెలు.
అల్లుకున్న పాదపుపద ఘట్టనలు….
సరి అయిన దారిన మోపెడుతూ..
ఒకసారి వేసిన ..మృదు మధుర అడుగులు…
నిను సగౌరవంగా నిలబెట్టే లా సరిచూసుకో….
కాలం చేసే గాయాలను..
స్వచ్ఛమైన మదితడితో
గెలుపు నవనీతపు పూతలతో
మాన్పేలా నీ మదిని.
చేధించలేని రాతి కోటలా..
నిర్మించుకుని..అసూయ. ఆటుపోట్ల
అలల అలజడి నుండి..కాపాడుకో….
ఓదార్పు ని వెతికి వేసారకుండా…
నువ్వే ఒక ఓదార్పు వై
అలసిన మనసును తాకే..
ప్రేమ పూరిత…పవన సమీరమై
ఎదుటి మది అంచులను తాకి చూడు…
ఆ మధుర భావన
నీకు కూడా…ఎంతటి
తాదాత్మ్యం ను ప్రసాదిస్తుందో
దారి చూపని అజ్ఞానపు నిశీధి లో..
అభ్యుదయ భావాల
వెలుతురు మిణుగురుల ను .
స్వేచ్చ గా వదిలితే
కొందరినైనా వెన్నెల వెలుతురు
పూల సువాసనలు తాకి.జీవితాన పున్నమి..వెలుతురు..పరచుకుంటుందేమో
మనసుఅద్దంను ..అంటిన ..అహపు…
అసూయపు.అధికార దర్పపు….
మనః మలినాలను…మానవత్వపు
ప్రేమ తత్వపు..సుగుణాల జలం తో శుద్ధి చేసి..
ఆత్మ ప్రతిబింబాన్ని..సరిచూసుకో…
Telugu Poetry