అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మీకు స్త్రీల పట్ల వేరే ఉద్దేశం ఉంటే – Telugu Moral Stories on Women
దాహంతో ఉన్న ఓ వ్యక్తి నీళ్లు బావి వద్దకు వెళ్లాడు, అప్పటికే అక్కడ ఓ మహిళ నీళ్ళు నింపుకుంటుంది. ఆ వ్యక్తి తనకు కొంచెం నీరు ఇవ్వాలని మహిళను కోరాడు. ఆ మహిళ సంతోషంగా అతనికి నీరు ఇచ్చింది. నీళ్ళు తాగిన తర్వాత, ఆ వ్యక్తి ఆ మహిళని మీరు చాలా అందంగా ఉన్నారు.. నాతో ఏకాంత సమయం గడుపుతారా అని అడిగాడు?

అది వినగానే, ఆ మహిళ పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది. నన్ను రక్షించండి.. రక్షించండి.. అని. ఆమె గొంతు విని గ్రామస్థులు బావి వైపు పరుగులు తీశారు. ఆ వ్యక్తి, “ఎందుకు ఇలా చేస్తున్నావు?” అని కంగారూ పడ్డాడు. దానికి ఆ మహిళ “ఇది విని గ్రామస్థులు వచ్చి నిన్ను కొడతారు. నీకు బుద్ధి వస్తుంది అని చెప్పింది.” దానికి ఆ వ్యక్తి తన తప్పుని తెలుసుకుని “నన్ను క్షమించు, మీరు మంచి, గౌరవప్రదమైన మహిళ. నన్ను ఈ సమస్య నుండి కాపాడండి అని వేడుకొన్నాడు”
ఆమె బావి దగ్గర వున్న కుండలోని నీళ్లన్నీ తన శరీరంపై పోసుకుని పూర్తిగా తడిసింది. ఈలోగా గ్రామస్తులు కూడా బావి దగ్గరకు చేరుకున్నారు. గ్రామస్థులు ఆ మహిళను “ఏమైంది?” అని అడిగారు. దానికి ఆమె “నేను బావిలో పడ్డాను, ఈ వ్యక్తి నన్ను రక్షించాడు అని చెప్పింది. ఈ మనిషి ఇక్కడ లేకుంటే నేను ఈరోజు చనిపోయేదాన్ని.” గ్రామస్తులు ఆ వ్యక్తిని దాన్యవాదాలు తెలిపి వారి భుజాలపై ఎత్తుకున్నారు.
గ్రామస్థులు వెళ్లిపోగానే ఆ స్త్రీ ఆ పురుషునితో ఇలా అంది, “ఇప్పుడు నీకు స్త్రీల స్వభావమేమిటో అర్థమైందా? ఒక స్త్రీకి బాధ కలిగించి, ఆమెను ఇబ్బంది పెడితే, ఆమె నీ సుఖాన్ని, శాంతిని క్షణాలలో దూరం చేస్తుంది మరియు ఆమెకు గౌరవం ఇస్తే ఆమె మీకు ఆనందాన్ని, శాంతిని కలిగిస్తుంది.”
మహిళల పట్ల గౌరవప్రదంగా నడుచుకోండి.
ఈ కథలను కూడా చదవండి.
ఈ కథలో ఆనందం యొక్క నిజమైన రహస్యం ఉంది
ఓ తరం ఆడవారి జీవితాలు
భక్తి భావం మనతో ఎన్నో అద్భుతాలు చేయిస్తుంది