ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Telugu Stories
Inspiring Telugu Stories – ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు .. చాలా దూరం ప్రయాణించాక, భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు .. టేబుల్ బుక్ చేసుకొని, తనక్కావాల్సిన భోజనం ఆర్డర్ ఇచ్చి ఎదురుచూస్తుండగా.. హోటల్ యజమాని, స్టాఫ్ పరుగుపరుగున బయటకు పరుగులు తీయడం చూసాడు..
కాసేపడికి వారంతా ముందు నడుస్తూ, వెనక ఒక పెద్దామెను సాదరంగా ఆహ్వానిస్తున్నారు.. ఆవిడ భోజనం చేస్తున్నంతసేపు హోటల్ యజమాని ఆవిడతో కబుర్లు చెప్తూ ఆమె పక్కన చేతులు కట్టుకుని నించున్నారు.. అసలెవరు వచ్చారు ..!? ఎందుకు వీరంతా వారిని అంత గౌరవంగా చూస్తున్నారు..!?
అందరూ వారి ముందు చేతులు కట్టుకుని నుంచున్నారు..!? ఇలా ఎన్నో ఆలోచనలు వ్యాపారవేత్త మనసులో.. ఉండబట్టలేక ఒక వెయటర్ అడిగాడు.. నేను కాసేపట్లో వస్తాను అని వెయిటర్ వెళ్లిపోయాడు.. కాసేపటికి హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకు వచ్చి.. ఆమె ఎవరు అని అడిగారంటగా ..!?
ఆమె మా టీచర్ ..! అన్నాడు హోటల్ యజమాని.. ఓస్ ..! టీచర్ నా ..! అదేంటి అలా అన్నారు ..!? ఆమె లేకపోతే మేమంతా ఇంత మంచి పొజిషన్ లో ఉండేవారిమా ..!? మేం చదువుకునే రోజుల్లో మాఅంత అల్లరి బ్యాచ్ లేదని అందరి టీచర్లలో ఒకటే భావన. వారి చేతిలో ఎప్పుడూ దెబ్బలు తింటూ ఉండేవాళ్లం..
అప్పుడు వచ్చారీ టీచర్ మా స్కూల్ కి.. చాలా ఓపికగా ఉండేవారు.. ఒకరోజు ఆమె మా అందరినీ ఒక్కొక్కరిగా పిలిచి చేతిలో ఒక చీటీ పెట్టారు.. అందులో ఏం రాసుందంటే, అందరిలోనూ ఉన్న ఒక్కొక్క మంచి గుణం.. మమ్మల్ని మొట్టమొదట మెచ్చుకోలు అదే..! ప్రతిరోజూ ఆ చీటీకోసం ఎదురుచూసేవాళ్లం.. అలా మా బ్యాచ్ పిల్లల మంచి గుణాలు ఒక్కొక్కటిగా ఆవిడ చెప్పేవారు..
అలా చెయ్యడం వల్ల మాలో నిదానంగా మార్పు రావడం మొదలైంది, టీచర్ చేసింది చిన్నగా కనిపించినా, అది మా జీవితాలను మార్చేసింది. స్కూల్ లో పోనుపోను మాకు మంచిపేరు వచ్చింది.. ఇప్పుడు మేమంతా మాంచి పొజిషన్ లో ఉన్నాం. అంత గొప్ప వ్యక్తికి ఈమాత్రం గౌరవం ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు కదా..! అన్నాడు హోటల్ యజమాని.. వెంటనే వ్యాపారి వాళ్లావిడకు ఫోన్ చేసి, నిన్న పార్టీకి నువ్వు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయ్..
అసలు నీకు సాటి నువ్వే అన్నాడు.. ఫోన్ అయ్యాక హోటల్ యజమానితో.. నాకు మా ఆవిడకి గొడవలు. ఇలా మెచ్చుకుంటే కొంతైనా మార్పు ఉంటుందని.. హా తప్పకుండా ఉంటుంది. ఓ వ్యక్తిని బతికించడానికి, ఒక బంధాన్ని బలపరచడానికి, నమ్మకంపై నమ్మకం కల్గించడానికి మెచ్చుకోలుని మించిన సంజీవని మరొకటి లేదు ..!
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి.