ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక ట్రక్ డ్రైవర్ ఒక పిచ్చాస్పత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్ టైర్ ఒకటి పంక్చర్ అయింది. రోడ్డు పక్కన ట్రక్కును ఆపుకొని కొత్త టైర్ బిగించడానికి సిద్ధం అయ్యాడు అంతలో చేతిలో ఉన్న నాలుగు బోల్టులు జారి కాలవలో పడిపోయాయి. అవి దొరికే పరిస్థితి లేదు.
ఏం తోచక తలపట్టుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక రోగి అటు పోతూ డ్రైవర్ను ‘ఏమైంది’ అని అడిగాడు. ‘సమస్యను ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా’ అని రోగికి ”బోల్టులు టైరుకు బిగించేప్పుడు కాలవలో పడిపోయాయి అని నిస్సహాయంగా చెప్పాడు.
రోగి ఒక్కసారిగా ఫక్కున నవ్వి, “ఇంత చిన్న సమస్య పరిష్కరించుకోలేకపోతే ఎప్పటికీ ట్రక్ డ్రైవర్ గానే ఉండి పోతావ్. మిగిలిన మూడు టైర్లలోనుండి ఒక్కొక్క బోల్టు తీసి ఈ టైరుకు బిగించు.
ఆ తరవాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్లి కొత్తవి బిగించుకోవచ్చు.” డ్రైవర్ ముగ్ధుడై, “ఇంత తెలివైన వాడివి పిచ్చాస్పత్రిలో ఎందుకున్నావ్” అన్నాడు. “నేను వెర్రివాడినేమో కానీ, తెలివితక్కువ వాడిని కాను.”
మన చుట్టూ ఉండేవాళ్ళను తెలివితక్కువవాళ్ళుగా భావించకూడదు. అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన తెలివికి అందని ప్రశ్నలకు చాలా మంది మంచి
పరిష్కారాలు చూపించగలుగుతారు. ఒక వ్యక్తి రూపురేఖలు, వస్త్రధారణ, స్థాయి, స్తోమత, విద్యార్హతలు చూసి తక్కువగా అంచనా వేయకూడదు.
సేకరణ – V V S Prasad
అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/