Menu Close

Telugu Moral Stories – చెత్త బండి సూత్రం


Telugu Moral Stories – చెత్త బండి సూత్రం

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

క్యాబ్ లో ఏర్ పోర్ట్ కు బయల్దేరాను. క్యాబ్ సరైన ట్రాక్ లోనే పోతోంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు అకస్మాత్తుగా సర్రున దూసుకొచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులేసి ఆ కారుకు తగలకుండా ఆగిపోయాడు. ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు.

మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వి, చేయి వూపుతూ ముందుకు సాగి పోయాడు. నాకు ఆశ్చర్యం వేసి, “నువ్వు అతన్నెందుకు వదిలేశావ్. క్షణంలో నీ కారు తుక్కుతుక్కై, మన ప్రాణాలు పోయేవి కదా.” ఆ క్యాబ్ డ్రైవర్ ఆ రోజు, “చెత్త బండి సూత్రం” అనే పాఠం నేర్పించాడు.

car telugu stories

అదేంటంటే చాలా మంది చెత్తబండ్లలాంటి వాళ్ళే!! వాళ్ళెప్పుడూ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తుంటారు.
చెత్త నిండి పోతున్నకొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి కదా! దాన్ని సీరియస్ గా తీసుకొని మన మీద పోయించుకోవడం అవసరమా! ఒక చిరునవ్వు నవ్వి, చెయ్యి ఊపి వెళ్లిపోతే మంచిది కదా! ఆ చెత్తను మన నెత్తినేసుకోవడం, దాన్ని మన భార్యాపిల్లల మీద, మనవాళ మీద వేయడం దేనికి ?? నిజానికి విజ్ఞులైనవాళ్ళు ఇటువంత చెత్త బండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు. ఈ చిన్న జీవితాన్ని చీకుచింతలతో గడపడం ఎందుకూ?? మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలెయ్యండి.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి

అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/

Telugu Moral Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading