ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక వ్యక్తి దగ్గర పంజరంలో ఒక చిలుక ఉండేది. ఒక సాధువు ప్రవచనాలు ఇస్తున్నాడని ప్రతి రోజు వినడానికి వెళ్ళేవాడు. చిలుక, యజమానిని, “ఎక్కడికి వెళుతున్నావు రోజూ!” “ప్రవచనాలు విని మంచి విషయాలు నేర్చుకోవడానికి”.
చిలక అడిగింది, “నాకు చిన్న సహాయం చేసి పెడతావా!! నాకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందో స్వామీజీని అడగగలవా!” ప్రక్క రోజు ప్రవచనం తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్లి, “స్వామీ! నా పంజరంలో ఉన్న చిలుక, తనకు ఎప్పుడు విడుదల దొరుకుతుందో అడగమనింది.” ఆ మాట విని సాధువు మూర్ఛ వచ్చి పడిపోయాడు.
భయపడి నిశ్శబ్దంగా పోయాడు అతను. ఇంటికి పోగానే చిలక అడిగింది, “స్వామీజీని అడిగావా!” ” నీ ఖర్మ. స్వామీజీని అడగ్గానే మూర్ఛ వచ్చి పడిపోయాడు.” చిలుక, “పర్వాలేదు అర్థం చేసుకోగలను.” అనింది. మరుసటి రోజు యజమాని పంజరం కేసి చూస్తే చిలుక చచ్చి పోయినట్లు కనిపించింది ‘ఏమైందా!’ అని పంజరం తలుపు తీసి చూశాడు.
చిలుక ఒక్కసారిగా ఎగిరి పోయింది. సాయంత్రం ప్రవచనానికి వెళ్ళినప్పుడు, స్వామీజీ కి జరిగినదంతా చెప్పాడు. స్వామీజీ, ” మూర్ఖుడా! ఇన్నాళ్లు ప్రవచనాలు విన్నా నీకు అర్ధం కాలేదు. పంజరంలోనే చిక్కుకొని ఉన్నావు. ఈ సమావేశాలకు రాకున్నా నేను ఏంచేసి చూపానో చిలుకకు అర్థమైంది. తప్పించుకొని పోయింది. నీవేమో ఇంకా పంజరం లోనే ఉన్నావు.
చాలామంది దృష్టి ఆ ప్రవచనాలు మీద ఉండదు. ప్రాపంచిక విషయాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. నేర్చుకోవాలనే కోరిక ఉంటే నిజాన్ని గ్రహించి, తప్పుడు ఆలోచనలను, అహాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే ఉన్నతమైన గొప్ప జీవితం లభిస్తుంది.
సేకరణ- V V S Prasad