ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఉదయం 8:30 ప్రాంతంలో ఒక 80 ఏళ్లు పైబడ్డ వృద్ధుడు హడావుడిగా హాస్పిటల్ కు తన బొటనవేలి గాయానికున్న కుట్లు విప్పించుకోవడానికి వచ్చాడు. తను అర్జెంటుగా 9 కల్లా పోవాలని డాక్టర్ని తొందరపెట్టాడు. పెద్దాయన మాటిమాటికీ టైం చూస్కొంటుంటే, డాక్టర్ గారు పెద్ద మనిషికి ట్రీట్మెంట్ చేసి పంపించేద్దామని గాయాన్ని చూశాడు, బాగా నయమైపోయింది, గాయానికున్న కుట్లు విప్పడానికి పూనుకున్నాడు.
ఆయనతో, మాట్లాడుతుంటే ఆయన అర్జెంటుగా ఒక నర్సింగ్ హోమ్ కి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళాలని. తొందర పెడుతున్నాడని డాక్టర్ కు తెలిసింది. డాక్టర్ గారు ఆయన భార్య ఆరోగ్యం గురించి అడిగాడు. “ఆవిడ నర్సింగ్ హోమ్ లో ఉందని, ఆమెతో బ్రేక్ఫాస్ట్ చేయడానికే వెళ్లాలని, ఆమె చాలా కాలంగా మతిమరుపువ్యాధితో బాధపడుతోంద”ని, చెప్పాడు పెద్దాయన.
ఆయన బొటనవేలికి కొత్తగా కట్టుకట్టాడు డాక్టర్, “మీ ఆవిడ ఆలస్యం అయితే బాధపడుతుందా!” అని అడిగాడు. “ఆమెకు నేనెవరినో గత ఐదేళ్ల నుండి తెలియదు. అంతా మరచి పోయింది.” “అయినా మీరు ఉదయాన్నే నర్సింగ్ హోమ్ కి, ఆమె గుర్తుపట్టకున్నా వెళ్తారన్నమాట!” ఆశ్చర్యపోతూ అడిగారు.
ఆయన నవ్వి, డాక్టర్ చేతి మీద చిన్నగా తట్టి, “ఆమెకు నేనెవరో తెలీదు, కానీ నాకు తెలుసు కదా ఆమె ఎవరో!!” ఆ పెద్దమనిషి వెళ్లిపోయిన తర్వాత డాక్టర్ కి ఒళ్ళు జలదరించింది,కన్నీళ్లు ఆగలేదు. “అటువంటి ప్రేమే కావాలి, జీవితంలో!” నిజమైన ప్రేమ శారీరకమైనది, యవ్వనంలో కలిగేది కాదు. నిజమైన ప్రేమ, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, భవిష్యత్తులో ఎలా ఉన్నా, సంపూర్ణంగా అంగీకరించేది.
సేకరణ- V V S Prasad