ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
పార్కులో ఒక బెంచి మీద ఒక స్త్రీ కూర్చుంది. అదే బెంచి మరొక చివర ఒకతను తన కూతురు సైకిల్ తొక్కుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఆ స్త్రీ అతనితో, “అదిగో! అక్కడ ఆడుతున్నాడే, ఎల్లో షర్టేసుకుని, అతనే మా అబ్బాయి!” అని చెప్పింది
“ఇదిగో! ఈ సైకిల్ తొక్కుతున్న అమ్మాయి నా కూతురు” గర్వంగా చెప్పాడు. అతను వాచీ చూసుకుంటూ కూతురుతో “లక్ష్మి! పోదామా…అమ్మా! టైం అయిపోతోంది.” అన్నాడు. “ఐదు నిమిషాలు నాన్నా… ప్లీజ్.. “కూతురు దీనంగా అడిగింది.
తండ్రి మాట్లాడకుండా ఆడుకోనిచ్చాడు. కొద్ది సేపు అయిన తర్వాత తండ్రి లేచి, “పోదామా అమ్మా!” కూతురు, “ప్లీజ్ నాన్నా! ఇంకొంచెం సేపు ఆడుకుంటా!” సరేనన్నాడు తండ్రి. తండ్రీ, కూతురు మధ్య సంభాషణ అంతా విన్న స్త్రీ, “మీకు చాలా సహనం ఉందండి!” అనింది. ఆయన నవ్వి, “లక్ష్మి అన్న కృష్ణ ఇక్కడ సైకిల్ మీద ఆడుకుంటూ ఒక తాగుబోతు డ్రైవర్ బండి కింద పడి చనిపోయాడు.
కృష్ణతో నేను ఎక్కువ కాలం గడపలేక పోయాను. ఒక్క ఐదు నిమిషాలు కృష్ణతో గడపడానికి ఇప్పుడు నేను ఏమైనా ఇస్తాను. మళ్ళీ అదే తప్పు చేయదల్చుకోలేదు. మా అమ్మాయి లక్ష్మి ఇంకొక్క ఐదు నిమిషాలు ఆడుకుంటానంటోంది. నిజానికి ఇంకో ఐదు నిమిషాలు నా కూతురు ఆడుకుంటుంటే చూసే గొప్ప భాగ్యం లభించిందనుకుంటున్నాను.”
జీవితం అంటే ప్రాముఖ్యతలను ఏర్పరుచుకోవడం, అందునా కుటుంబం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ప్రాముఖ్యత. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి.
సేకరణ – V V S Prasad