అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Moral Stories
ఒక చోట ఒక పెద్ద ప్రాజెక్టు కడుతున్నారు. ఒక పెద్ద బండరాయిని తొలగించడానికి నలుగురు కూలీలు కష్టపడుతున్నారు. ఆ రాయిని కదల్చడం వారి వల్ల కావడం లేదు. పక్కనే బీడీలు తాగుతూ ఇంకొక వ్యక్తి, “ఊ… తొయ్యండి… గట్టిగా తొయ్యండి” అంటూ పురమాయిస్తున్నాడు.
పక్కనుండి పోతున్న ఒక పెద్ద మనిషి. “ఊరికే అలా అరవకపోతే కొంచెం సహాయం చెయ్యొచ్చుగా” అన్నాడు. దానికా బీడీలు తాగుతున్న వ్యక్తి చిద్విలాసంగా “నేను సూపర్ వైజర్ను. అది నా పని కాదు” అంటూ జవాబిచ్చాడు.
బండరాయిని తొలగించడానికి ఆ పెద్దమనిషి కూలీలకు సహాయం చేసి, సూపర్ వైజర్ తో, “నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈ ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ ను, నీకెప్పుడైనా ఇటువంటి అవసరం వస్తే నిరభ్యంతరంగా పిలు, సహకరిస్తాను. అని వెళ్ళబోయాడు. సూపర్ వైజర్ విశ్వేశ్వరయ్య గారి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు.
సేకరణ – V V S Prasad