ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక అడవి గుండా పోతున్న మనిషి, దారిలో టైం పాస్ అవుతుందని మా పూర్వీకులు కోతులే అంటూ ఒక కోతితో స్నేహం చేసాడు. ఉన్నట్లుండి ఒక సింహం భీకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది. కోతి, దాని వెనక మనిషి దగ్గరలో ఉన్న చెట్టెక్కి అపాయం నుండి తప్పించుకున్నారు. ఈ లోపల సింహం వాళ్ళిద్దరిలో ఒకరు తనకు ఆహారమైతే, ఇంకొకరిని వదిలేస్తానని బేరం పెట్టింది. ఎవరు ప్రాణత్యాగం చేయాలో తెలియక, చావైనా, బతుకైనా కలిసే చద్దామని అనుకున్నారు.
సింహం నిరాశ పడింది కానీ, ఆశలు, ప్రయత్నాలు ఆపలేదు. చెట్టు కిందే ‘దిగక పోతారా’ అని చూస్తూ కూర్చుంది. అలా చాలా సేపు గడిచే సరికి చెట్టు పైనున్న మనిషికి, కోతికీ, దాహం, ఆకలి, నిస్సత్తువ, నీరసం, నిద్రమత్తు ఆవహించాయి. ఒకరి తర్వాత ఒకరు నిద్రపోవాలనుకున్నారు. ముందు మనిషి
నిద్ర పోతే కోతి కాపలా కాసింది. ఆ తరవాత కోతి నిద్రకు ఉపక్రమించింది. మనిషిలో దురాలోచన మొదలైంది.
కోతిని క్రిందికి తోసేస్తే బ్రతికి పోవచ్చు కదా అని దుర్బుద్ధితో నిద్ర పోతున్న కోతిని తోసేసాడు. కోతి పడబోతూ, కింది కొమ్మను అందుకొని పైకి ఎగబ్రాకింది. మారు మాట్లాడకుండా అసలేం జరిగినట్లు యధాస్థానంలో పడుకొనింది. ఉదయం కోతి మనిషిని అడవి దాటిస్తూ మనిషికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది, “దయచేసి ఇంకెప్పుడూ మీ మనుషులకు పూర్వీకులు కోతులే అని చెప్పి అవమానించ వద్దు!”
మానవత్వం లేని మనిషి జంతువుకన్నా హీనం.
సేకరణ – V V S Prasad