అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదు – Telugu Moral Stories
ఒక పేద పిల్లవాడు, చదువులు పూర్తి చేసుకోవడానికి చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడు. ఆ రోజు అతనికి చాలా ఆకలి వేసి, ఓ ఇంటి దగ్గరకు ఆగి ‘అమ్మా ! ఒక ముద్ద అన్నం పెట్టు’ అని అడగాలని అనుకొని, అడగలేక ఒక గ్లాసు మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు.
అబ్బాయి చాలా ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకొని ఆ యువతి ఒక పెద్ద గ్లాసుతో పాలు ఇచ్చింది. ” అమ్మా! మీకు నేనెంత బాకీ ఉన్నాను”, ఏం లేదులే!, “అమ్మ చెప్పింది చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదు” అని. ‘హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ ఆ అబ్బాయి వెళ్లిపోయాడు.
అతనిలో కొత్త ఆత్మస్వైర్యం, మానవత్వంపై నమ్మకం ఏర్పడ్డాయి. కొన్నేళ్ల తరవాత ఆ యువతి అంతు తెలియని జబ్బున పడింది. స్థానికంగా ఉన్న డాక్టర్లు పెదవి విరిచి పట్నంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. అక్కడి డాక్టర్లు ఆ వింత వ్యాధి నయం చేయడానికి డా. హొవార్డ్ కెల్లీని పిలిపించారు.

ఆ యువతి వచ్చిన ఊరు తెలుసుకుని, కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉంటే, ఆవిడకు వైద్యం చేయడానికి పూనుకున్నాడు. మొదటి చూపుతోనే, ఆనాడు గ్లాసు పాలతో ఆకలి తీర్చిన అమ్మ అని తెలుసుకొని, సంపూర్ణ ఆరోగ్యం సమకూరే వరకు శ్రద్ధగా వైద్యం చేసాడు. డా. కెల్లీ ఆమె హాస్పిటల్ బిల్లును తీసుకుని అంచున ఏదో రాసి, బిల్లును ఆమెకు పంపాడు. బిల్లు చూసి, ఎంతైందో అని చాలా భయపడి, ధైర్యం కూడగట్టుకుని బిల్లు విప్పి చూసింది, అంచున రాసిన, “ఒక గ్లాసు పాలతో బిల్లు పూర్తిగా చెల్లించబడింది”
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు