Menu Close

Telugu Love Stories – నాలో పులకింతలు


Telugu Love Stories – నాలో పులకింతలు

కరోనా తర్వాత లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో తను మా అపార్ట్ మెంట్లోకి ఈ మధ్యే అద్దెకు వచ్చాడు. తనను చూసినప్పటి నుండి నాకు ప్రభాస్, విజయ్ దేవరకొండలే గుర్తొచ్చేవారు. ఎందుకంటే ఆరడుగుల ఎత్తు, మంచి హెయిర్ కట్ స్టైలిష్ గా ఉండేవాడు.

అందుకే ఆ క్షణం నుండి తనంటే బాగా క్రష్ పెరిగిపోయింది. ఇంకేముంది తనతో ఎప్పుడెప్పుడు పరిచయం చేసుకుందామా అని ఆత్రుతగా ఎదురుచూసేదాన్ని. అలా ఒకరోజు అనుకోకుండా తనే నాతో మాట్లాడాడు.

ఏదో అడ్రస్ కనుక్కోవడానికి నాతో మాట్లాడాడు. అలా మా ఇద్దరి మాటలు కలిశాయి. ఆ వెంటనే పరిచయమైన మా ఇద్దరం ఆ వెంటనే నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నాం. అప్పటి నుండి రెగ్యులర్ గా చాటింగులు, ఫోన్లో కబుర్లు, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేసుకునేవాళం. అప్పటి నుండి తనను నేరుగా ఎప్పుడు కలుస్తానా అని ఆలోచిస్తున్న తరుణంలో, ఒకరోజు అకస్మాత్తుగా తను, నేను లిఫ్టులో ఒకేసారి చేరుకున్నాం.

అప్పుడు నాకు పోకిరి సినిమాలో మహేష్ బాబు, ఇలియానా సీన్ గుర్తొచ్చింది. నేను కూడా అచ్చం అలా జరగాలని కోరుకున్నాను. కానీ నేను ఊహించింది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి.. అదేంటంటే…

మేమిద్దరమే ఉండటం.. అలా అనుకోకుండా మేమిద్దరం కలవడంతో నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే అంతలోనే తను ఉన్నట్టుండి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రేమగా కిస్ చేసేశాడు.

love couple telugu stories

నాలో పులకింతలు.. అంతే నాలో ఏదో తెలియని పులకింత గిలిగింత పెట్టేసింది. నా మనసులో మెదులుతున్న మాటను కూడా చెప్పడానికి అదే సరైన సమయమని భావించాను. అంతే వెంటనే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసేశాను.

మరింత ఆలస్యం.. అలా చేస్తే లిఫ్ట్ మళ్లీ స్టార్ట్ అవ్వడానికి మరింత సమయం పడుతుందని, అంతవరకు కాస్త ఆలస్యం అవుతుందన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే కొంచెం రిస్క్ తీసుకున్నా.

నా మనసులోని మాటను.. అంతే అదే సమయంలో కళ్లు మూసుకుని నా మనసులోని మాటల్ని చెప్పేశాను. లవ్ ప్రపోజ్ చేసేశాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేశాడు.

గట్టిగా హత్తుకున్నాడు.. అంతే ఒక్కసారిగా నన్ను గట్టిగా హత్తుకున్నాడు. అసలే చలికాలం.. లిఫ్టు లోపలంతా హాట్ హాట్ గా ఉంది. మా ఇద్దరి మధ్య వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది.

love couple telugu stories

ఏం జరిగిందంటే.. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఈపాటికే క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. అలా మేమిద్దరం ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మేం చేసిన అడ్వెంచర్ మాకు ఎప్పటికీ జ్ణాపకంగా ఉండిపోతుంది.

పెళ్లి చేసుకున్నాం.. ఇంకేముంది.. వారి ఇంట్లో.. మా ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాం. మేమిద్దరి మంచి పొజిషనల్ ఉండటంతో.. పైగా ఇద్దరు జాబర్స్ కావడంతో కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. దీంతో మేమిద్దరం హాయిగా పెళ్లి చేసుకున్నాం.

మరోసారి అలాంటి అనుభవం.. పెళ్లి తర్వాత కూడా నాకు ఇలాంటి తియ్యని అనుభవం మరోసారి ఎదురైంది. ఓ రోజు పార్టీ నుండి తిరిగొచ్చిన తర్వాత మా ఫ్లాట్ కి వెళ్లడానికి నేను, నా భర్త లిఫ్ట్ ఎక్కాం.

డోర్ క్లోజ్ అయిన వెంటనే.. అలా లిఫ్టు డోర్ క్లోజ్ అయిన వెంటనే తను నన్ను బాగా దగ్గరకు తీసుకుని కిస్ చేస్తుంటే.. మా ఇద్దరికీ తొలిసారి కిస్ చేసుకున్న ఫీలింగ్ మళ్లీ గుర్తొచ్చింది.

స్టాప్ బటన్.. నా ఫాంటసీ లిఫ్టులోని ఒక విష్ పూర్తవ్వబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా కోరిక తీర్చేందుకేనేమో నా భర్త స్టాప్ బటన్ నొక్కి లిఫ్ట్ ఆపేశాడు. అలా కాసేపు లిఫ్టులోనే ఏకాంతంగా గడిపేసి మా ఫ్టాట్ కి తిరిగొచ్చేశాం. అలా ఐదు నిమిషాల లిఫ్ట్ ప్రయాణం నా జీవితంలో మంచి అనుభవంగా మిగిలిపోయింది.

Telugu Love Stories

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
4
+1
0

Subscribe for latest updates

Loading