Menu Close

Telugu Jokes Text Part 10

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

స్టూడెంట్: టీచర్! మనం చెయ్యని దానికి శిక్ష పడుతుందా?
టీచర్: Of Course! పడదు. ఏం, ఎందుకలా అడిగావ్?
స్టూడెంట్: అమ్మయ్య! నేను ఇవ్వాళ homework చెయ్యలేదు. అందుకని…

Employee: సార్ మీరు మన ఆఫీస్ లో సింహం కదా, మరి ఇంట్లో ఎలా ఉంటారు, 
బాస్: భలేవాడివే నేను ఇంట్లోనూ సింహంలానే ఉంటాను, కానీ దుర్గామాత సింహం మీద కూర్చొనుంటుందక్కడ. 

బాస్: ఎక్కడికెళ్ళావు? 
employee:
కటింగ్ చేయిచుకోడానికి వెళ్ళా సార్,
బాస్: ఆఫీస్ అవర్స్ లోనా? 
employee: జుట్టు పెరిగింది ఆఫీస్ అవర్స్ లోనే కద సార్
బాస్: అబ్బా బాగుందయ్యా నీ అతి తెలివి, మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెరుగుతుంది కదా జుట్టు
employee:
అందుకే సార్, ఆఫీస్ లో ఎంత పెరిగితే అంతే కత్తిరించమన్నాను బార్బర్ ని.  

రాజు: నాన్నా స్కూల్లో ఒక చిన్న గెట్ టుగెదెర్ ఉంది వస్తావా? 
తండ్రి: చిన్న గెట్ టుగెదెరా? అదేంటిరా?
రాజు: హా, అవును, కేవలం నువ్వూ, నేను ఇంకా మా హెడ్ మాస్టరూనూ, అంతే

దేవుడికీ, డాక్టరుకీ ఎప్పుడూ కోపం తీసుకురాకూడదు. 
ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు, 
డాక్టర్ కి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు 

సరికొత్త నియమాలు 

సమతుల్య నియమం : 
భార్య ఐదునిమిషాలలో రెడీ అయ్యొస్తానని చెప్పిన సమయం ఖచ్చితంగా భర్త ఐదునిమిషాలలో కాల్ చేస్తానన్న సమయానికి సమానం. 

క్యూ నియమం : 
మీరు నిలబడిన క్యూ మారిస్తే మీరు వదిలేసిన క్యూ ఎప్పుడు తొందరగా కదులుతుంది. 

టెలిఫోన్ నియమం : 
రాంగ్ నంబరుకి కాల్ చేసినప్పుడు ఎప్పుడూ బిజీ ఉండదు. 

యంత్రతత్వ నియమం : 
మీ చేతులు గ్రీజు తో బాగా మురికిగా ఉన్నప్పుడు ముక్కు దురద పెట్టడం. 

సంభావ్యతా నియమం : 
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు మీకు తెలిసినవారు చూసే సంభావ్యత ఎక్కువగా ఉండటం. 

ప్రతిపాదనా నియమం : 
ఎవరినా మిమ్మల్ని ఒప్పుకున్న వెంటనే వేరొకరు మీకు మెరుగ్గా కనపడటం 

టీ కాఫీ నియమం : 
మీరు టీ తెచ్చుకొని తాగుతున్నప్పుడే మీ బాస్ మిమ్మల్ని ఏదో సాల్వ్ చెయ్యమని అడగటం, ఆ సమస్య కూడా సరిగ్గా టీ చల్లారినప్పుడే పరిష్కారమవ్వడం 

భర్త : రజనీ డార్లింగ్, సుకుమారమైన నీ జుట్టుని జాగ్రత్తగా చూసుకోవచ్చుగా…
భార్య : (సిగ్గు పడుతూ) మీరలా అంటుంటే నాకు సిగ్గేస్తోంది
భర్త  :అమ్మతోడు, మళ్ళీ ఇంకోసారి అన్నంలో నీ తల జుట్టు రావాలి, నీ బుర్ర పగిలిపోద్ది.  

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading