ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నిన్నిలా నిన్నిలా చూశానే… కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వేయనంతగా… కనుల పండగే…
ఏ… నిన్నిలా నిన్నిలా చూశానే… అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినబడిందిగా… ప్రేమ చప్పుడే…
నిన్ను చేరి పోయే నా ప్రాణం… కొరెనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం… నాలో ఆనందం…
నన్ను నేనే మరిచిపోయేలా… ఈ క్షణం…
ఈ వర్గానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా… ||2||
తొలి తొలి ప్రేమే దాచేయకలా… చిరు చిరు నవ్వే ఆపేయకిలా
చలి చలి గాలి వీచేంతలా… మరి మరి నన్నే చేరింతలా
నిన్ను నీ నుంచి నువ్వు… బయటకి రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న… జాబిలమ్మలా
ఈ వర్గానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా… ||2||