Telugu Jokes – దోమకి జోలపాట
‘కరుణా’కర్ నిద్రపోతున్నాడు…
ఒక దోమ అస్తమానం అతని చెవి చుట్టు తిరుగుతూ, ‘గుఁయ్…’ మని రొద చేస్తూ అతనికి నిద్రాభంగం కలిగిస్తోంది!
కరుణాకర్ కి చిర్రెత్తింది…
నిద్రపోతున్నట్టు నటిస్తూ, ఆ దోమను చటుక్కున పట్టుకున్నాడు…
దాన్ని, తన పిల్లో మీద పడుకోబెట్టి, ఒక చక్కటి లాలిపాట పాడాడు…
ఆ దోమ మెల్లగా నిద్రలోకి జారుకుంది…
అది నిద్రపోయిందని రూఢి చేసుకున్న తర్వాత… …
కరుణాకర్ ఆ దోమ దగ్గరగా నోరు పెట్టి, ‘గుఁయ్…’ మని శబ్దం చేసాడు…!
ఆ దెబ్బకు దోమ జడుసుకుని నిద్రలేచి పారిపోయింది…!
పారిపోతున్న దోమను చూస్తూ, మన కరుణాకర్ ‘ఇప్పుడర్థమయిందా, అప్పట్నుండీ నాకెంత చిర్రాగ్గా ఉండిందో?!? ఈ కరుణాకర్ తో పెట్టుకోకు!!’ అని వార్నింగ్ ఇచ్చాడు…!!
Telugu Jokes – నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.