ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మెతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా…
మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా….
రైతు కంటి లో నలుసు పడితే
దేశం అంత చీకటేరా..
మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా..
జాము పొద్దుకే నిదుర లేచి
కళ్ళ ఊసులు కడుక్కొని
పాత చెప్పులు చేతి కర్ర
నోటి లోపల గర్రమేసుక మసక చీకటి
చీల్చుకుంటూ పొలం పనులకు పోవు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
ఆసనాలు ప్రణవ్యయమం వ్యయమం తెలియనొడు
దొక్కలేండి బొక్కలేండి దోరణంల మారినొడు
చెమట చెమటై రక్త మాంసం
కరిగి కష్టం చేసేటోడు..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
ఆలుబిడ్డలు కూలికేళ్తరు..
ముసలి ముతక ఇల్లు చూస్తారు..
పండుగలు పబ్బలకైన పట్టెడన్నం పప్పు చారే..
జ్వరమునొప్పులు వచ్చిన మందులుండవు సెలవులుండయి
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
ఆకలైతెనే తిండి తింటాడు పంచబక్షాలాశించడు
ఎండవానకు ఓర్చుకుంటడు బట్టపొట్టకు తృప్తి పడతడు
పూట పూట కు పాటూ పడియి పుడమితల్లిని నమ్ముకుంటడు
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
వాన అంటాడు కరెంట్ అంటాడు
విత్తనాలు ఎరువులంటడు పంటలంటడు దరలుఅంటడు పోద్దుమాపు గులుగుంతుంటడు
ఏర్రియేనకకు తగ్గిన మనసులోనే కుములుతుంటడు
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
మెతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..
యాసంగికి పంటతిస్తాడు వానకాలం పంటతీస్తాడు
ప్రతి పంటకు అప్పు చేసి పంటపంటకు తీర్చుకుంటాడు
విలువ పోయేసమయం వస్తే యే….
విలువ పోయేసమయం వస్తే నిలువు ప్రాణం తీసుకుంటాడు.😭