ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
ఇగరం గల్లోడినంటూ.. రాతో నా రాత
నాతో ఇయ్యమందుకున్నాడు.. పోతో నీ పోత
ఇంపుగ నను సూస్తనంటే.. రాతో నా రాత
ఇల్లలికి ముగ్గుపెడితి.. పోతో నీ పోత
తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
ఈతాకుల ఇల్లు లేదు.. రాతో నా రాత
నా తాటాకుల తడక లేదు.. రాతో నా రాత
పోకిళ్లకు పోతరాజు.. రాతో నా రాత
నేనోటంటే ఓటంటడు.. పోతో నీ పోత
ఎంత పాయిరంగ నేను చెప్పినా.. రాతో నా రాత
పైస పని చెయ్యడమ్మ.. పోతో నీ పోత
తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
కమ్మల్లేవ్, కడియాల్లేవ్.. రాతో నా రాత
కట్టుకోను మంచి చీర లేదు.. రాతో నా రాత
గాజుల్లేవ్, గంటీల్లేవ్.. రాతో నా రాత
గడియ రికాం లేని చేత నాది.. పోతో నీ పోత
ముద్దూ ముచ్చట లేదు.. రాతో నా రాత
ముదనష్టపు మొగోడమ్మ.. పోతో నీ పోత
తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
సిరల్లేవ్, రైకల్లేవ్.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
కష్టమొచ్చి సర్దుకుంటే.. రాతో నా రాత
కట్టుకున్నావానంటరమ్మ.. పోతో నీ పోత
నేను హద్దుమీరి ఏమడిగితి.. రాతో నా రాత
బుద్ధి కలిగి ఉండమంటి.. పోతో నీ పోత
తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత
నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత
ఎహే నేను పోతపో..