Menu Close

కుటుంబానికి ఒక మంచి ఇల్లు, కారు, నగలు కన్నా ప్రేమ, అభిమానం, గౌరవం చాలా ముఖ్యం – Telugu Family Stories – Pitta Kathalu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Family Stories – Pitta Kathalu

ఒక ఒంటరి మహిళ తోడుకోసం ఒక మాట్లాడే చిలకను కొనుక్కుంది.
అయితే పక్క రోజు ఆ షాపుకొచ్చి, అసహనంగా
“ఈ పక్షి మాట్లాడ్డం లేదు.” అనింది.

“పంజరంలో అద్దం పెట్టారా ! చిలుకలకు అద్దాలంటే చాలా ఇష్టం.
తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంది.”
ఆ మహిళ అద్దం కొని పంజరంలో పెట్టింది.
పక్క రోజు, “అద్దం పెట్టినా మాట్లాడడం లేదు!” ఫిర్యాదు చేసింది.

“చిలుకలకు నిచ్చెనలంటే ప్రాణం, ఒకటి లోపల పెట్టండి.”
“అయినా మాట్లాడడం లేదు” అంటూ మళ్ళీ వచ్చింది.

“పంజరంలో ఊయల ఉందా? ఉయ్యాలలో ఊగుతూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంది.”
పంజరంలో పట్టే ఉయ్యాల ఒకటి కొనుక్కుని వెళ్లింది.
ఆ మరుసటి రోజు ఏడుపు మొహంతో మళ్ళీ వచ్చింది.
“ఏమైంది!!” అడిగాడు.

“చిలుక చచ్చి పోయింది” హతాశుడయ్యాడు పక్షుల వ్యాపారి.
“చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా!”
“అక్కడ చిలుకలు తినడానికి ఏమీ అమ్మరా?? అంటూ ఊపిరి ఒదిలింది,”
అనింది ఆవిడ.

చాలా సార్లు జీవితానికి ఏది ముఖ్యమో మరిచిపోయి,
ప్రాముఖ్యం లేని విషయాల పట్ల మొగ్గు చూపిస్తాం.
“అవును !! కుటుంబానికి ఒక మంచి ఇల్లు, కారు, సోఫాలు, అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమే !!
అవి కొనిచ్చి అందరినీ సంతోష పరుస్తున్నాం, అనుకొని భ్రమపడడం కూడా తప్పే.
వీటన్నిటికన్నా ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద వంటివి చాలా ముఖ్యం”.

Pitta Kathalu Telugu Family Stories

సేకరణ – V V S Prasad

Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu

Love Stories in Telugu
Prema Kathalu

Pitta Kathalu, Neethi Kathalu

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading