Menu Close

మానవ జాతి చరిత్రలో బయంకరమైన అంటు వ్యాధులు

కరోనా ఒక్కటేనా ఇప్పటివరకు ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, కాదు ఇంతకముందే ఇంతకన్నా బయంకరమైన అంటు వ్యాధులు ఈ ప్రపంచంపై ఢందయాత్ర చేసి, ఈ ప్రపంచాన్ని సర్వ నాశనం చేశాయి. అలాంటి అంటు వ్యాధుల గురుంచి కొంత సమాచారాన్ని మేము ఇక్కడ పొందు పరిచాము.

సిర్కా ఎపిడమిక్ :- దాదాపు క్రీ.పూ.3000 సంవత్సరంలో వచ్చింది. చైనాఈశాన్య ప్రాంతంలో ఈ వ్యాధి వచ్చింది. దీని వలన ఆ ప్రాంతంలో ఉన్న జనాభా అంతా తుడిచి పెట్టుకొని పోయింది.

ఏథెన్స్ ప్లేగ్ ( క్రీ.పూ. 430): – దాదాపు ఒక లక్ష మంది మరణించారు. ఈ కారణం వలన ఏథెన్స్ స్పార్టా చేతిలో ఓడింది.

ఆంటోనియన్ ప్లేగ్ ( క్రీ.శ.165 – 180 ) :-రోమ్ లో వచ్చింది. పర్షియాలో పుట్టి రోమ్ లో వ్యాపించింది.ఐదు మిలియన్ జనాభా మరణించారు.

జస్టీనియన్ ప్లేగ్ (క్రీ.శ.527-565):- ఈ ప్లేగు వలన ప్రపంచ జనాభా లో పది శాతం అంతరించింది.బైజాంటైన్ చక్రవర్తి జస్టీనియన్ కాలంలో ఈ అంటువ్యాధి వచ్చింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీని వల్ల బైజాంటైన్ సామ్రాజ్యం బలహీనపడి అంతరించింది.

ది బ్లాక్ డెత్ (క్రీ.శ.1346-1353):- ఈ వ్యాధి ఆసియా మరియు యూరప్ లను వణికించింది.యూరప్ జనాభా సగం అంతరించింది. ఒక్కొక్కరిగా దహనం చేయలేక సమూహాలుగా జనాలను కాల్చివేశారు.ఇది కూడా ఒక రకమైన ప్లేగు వ్యాధియే.

కోకోలిడ్జి అంటువ్యాధి (క్రీ.శ.1545-1548):- కోకోలిడ్జి అంటే అజ్ టెక్ భాషలో అంటు వ్యాధి అని అర్థం. మెక్సికో, మధ్య అమెరికా లో వచ్చింది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వచ్చింది.పదిహేను లక్షల మంది మరణించారు.

అమెరికన్ స్మాల్ ఫాక్స్ (క్రీ.శ. 16వ శతాబ్దం ):-అమెరికా లో వచ్చిన ఈ మశూచి వలన అమెరికా స్థానిక జాతులు 90శాతం అంతరించాయి. యూరప్ దేశీయులు స్థానిక ప్రజలను సులభంగా ఓడించి అమెరికా వ్యాప్తంగా విస్తరించారు.

గ్రేట్ లండన్ ప్లేగ్ (క్రీ.శ.1665-1666):- కింగ్ చార్లెస్-2 కాలంలో ఈ అంటువ్యాధి వచ్చింది. దాదాపు ఒక లక్ష మంది మరణించారు. లండన్ నగరంలో పది శాతం మంది మరణించారు.

గ్రేట్ మార్సిలీ ప్లేగ్ (క్రీ.శ.1720-1723):- ఫ్రాన్స్ లోని మార్సిలీ నగరంలో, ఆ చుట్టు పక్కల దాదాపు ఒక లక్ష మంది మరణించారు. గ్రాండ్ సెయింట్ ఆంటొన్నే అనే నౌక ద్వారా మధ్య దరా ప్రాంతం నుండి ఈ వ్యాధి వ్యాపించింది.

రష్యన్ ప్లేగ్( క్రీ.శ.1770-1772):- మాస్కో నగరం , ఆ చుట్టు పక్కల దాదాపు ఒక లక్ష మంది మరణించారు.

ఫ్లూ మహమ్మారి ( క్రీ.శ. 1889-1890) :-ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియన్ మంది మరణించారు.

ఆసియా ఫ్లూ ( 1957-58 ):- ఒక మిలియన్ మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు.

ఎయిడ్స్ (క్రీ.శ. 1981- ఇంకా కొనసాగుతూనే ఉంది):- దాదాపు మూడు కోట్ల యాభై లక్షల మంది ఇప్పటి వరకు మరణించారు. ఒక్క ఆఫ్రికా లోనే ఈ వ్యాధితో 4 కోట్ల మంది జీవిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ (క్రీ.శ. 2009-2010):- ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు మిలియన్ల మంది మరణించారు.
ఇంకా ఎబోలా, జికా వైరస్ తదితరాలు ఎన్నో తరచుగా వస్తూ ఉండడం మనం గమనించవచ్చు.

ఏది ఏమైనా మానవజాతి తరతరాలుగా ఎన్నో అంటువ్యాధులను మహమ్మారులను ఎదుర్కొంది. కొత్త రకం అంటువ్యాధులు పుట్టటం,వాటికి మందులు, టీకాలు తదితరాలు కనుక్కోవడం, ఆలోగా ఎంతో జన నష్టం జరగటం మనకు నిత్య అనుభవమే. ఏది ఏమైనా ఈ అంటువ్యాధుల నుండి తగిన గుణపాఠం నేర్చుకుంటూ మానవాళి పురోగమిస్తున్నది.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading