Menu Close

సాయం అనేది ఉన్నంతలో చేసుకుంటూపోవాలి – Telugu Stories


“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.
“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి – ఇలా చెప్పాడు.

నేను డబ్బు, పేరు సంపాదించక ముందు మామూలుగా ఉన్న రోజులలో ఒక నాడు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక చదవటం నాకు ప్రతిరోజు అలవాటు. పత్రిక కొందామని వీధుల్లో పత్రికలు అమ్మే ఓ అబ్బాయి వద్ద ఉన్న పత్రికను చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.

దీంతో ఆ అబ్బాయి “పర్లేదు సర్ …మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” అంటూ బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడు పత్రికలు అమ్ముతూ నాకు కనిపించాడు… మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.

ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను సర్… ఓ పది ఇరవై పత్రికలు అమ్మితే వచ్చే కమిషన్ ను సాయంత్రం నా యజమాని నాకు తగ్గిస్తాడు.. అంతే కదా అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు . నాకు మీకు సహాయం చేశానన్న తృప్తి మిగులుతుంది.

ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించాను.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుగా మారాను.. న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ అయినప్పుడల్లా కుర్రోడు గుర్తొచ్చే వాడు… కానీ నాకున్న వేల కోట్ల సామ్రాజ్యం బిజీ షెడ్యూల్ మూలాన అతని నేను కలుసుకోలేదు… ఓ రోజు నా బిజీ షెడ్యూల్ తగ్గించుకొని ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. వేరే ప్రాంతంలో పేపర్లు అమ్ముకుంటూ ఉంటే గుర్తించి మా వాళ్లు తీసుకువచ్చారు. అప్పుడు

“నేనెవరో తెలుసా నీకు …గుర్తు పట్టేవా ఆ రోజు నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను. “మీరు తెలుసు…బిల్ గేట్స్…. ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” “ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు…

నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “ ఆతను చిన్నగా నవ్వి
“సర్… మీరు ఏ సహాయం చేసిన వద్దంటూనే చిన్నగా నవ్వి సున్నితంగా తిరస్కరించాడు…. అతను మాట్లాడుతూ అయ్యా మీరు ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఈరోజు అడిగితే మీరు ఏమి అడిగిన తెచ్చిస్తారు కానీ….. ఆ రోజు నేను చేసిన దానికి మీరు చేసే సమయానికి సరితూగుతుందని నేను అనుకోను సర్..అని అన్నాడు..

“ఎందుకు సరితూగదు?” అని నేను ఆశ్చర్య పోయాను. “నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా నాకొచ్చే చిన్నపాటి ఆదాయంతోనే మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు… ఈ రెండు సహాయాలు సరితూగుతాయా సార్ అంటూ అడిగాడు…

అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును… నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.

అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే…ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading