ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు. అసలు కళ అంత వారి కళ్ళలోనే ఉందా అన్నట్లు ఉంటుంది. పెళ్లి ఘడియల ముందు..
పెళ్లికూతురు మోములో సిగ్గు.. అబ్బాయి కళ్ళలో ఆనందం.. ఇవే కదా అసలు పెళ్లి వేడుకకు సందడి తీసుకొచ్చేది.
ఇప్పుడంటే.. కరోనా కారణం గా పెళ్లి కి ఎక్కువ మంది హాజరు అవ్వడం లేదు. అంతగా సందడి కూడా ఉండడం లేదు. కానీ.. మొన్నటి వరకు పెళ్లి అంటే… వందలమంది గెస్ట్ లు గా వచ్చేవారు.
నూతన వధూవరులను మనస్పూర్తి గా ఆశీర్వదించేవారు. ఇంతమంది తమ కళ్ళను వధూవరులవైపే ఉంచుతారు. ఏర్పాట్లను సంతృప్తి చెందినా.. వాటిపైన కంటే ఎక్కువ ఫోకస్ వధూవరులపైనే ఉంటుంది. అందుకే.. వధూవరులకు దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతారు.
అలాగే.. ఈ దృష్టి దోషాన్ని నివారించడం కోసం.. తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కొడుకులను కూడా ముస్తాబు చేసి పక్కన కూర్చోబెడతారు. అయితే.. తోడు పెళ్ళికొడుకు, పెళ్లికూతుర్లను మాత్రం చిన్న వయసు వారిని ముస్తాబు చేస్తుంటారు. అలాగే.. పెళ్లికూతురు గా చేసిన తరువాత.. వారు ఎక్కడకి కదలడానికి ఉండదు. అందుకే వీరికి తోడుగా కూర్చోపెట్టిన వారు వీరికి తోడు గా ఉండడం తో పాటు..వీరికి కావాల్సిన అవసరాలను కూడా చూడడానికి వీలుంటుంది అన్న ఉద్దేశ్యం లో ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.