ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మనిషి నిజమైన గుర్తింపు అతడి వ్యవహారమే – Intelligent Stories in Telugu
ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు. రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.
కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు. అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు – “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.
రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.
Intelligent Stories in Telugu – ఇలాంటి కథలు చెప్పండి మీ పిల్లలకి.
రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు. అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు… అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు. అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము అని .
రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు. రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు.
10 సులభమైన ప్రశ్నలు అడగనా, ఒక క్లిష్టమైన ప్రశ్న అడగనా – Intelligent Stories in Telugu
కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు. రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు. మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని. రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.
అప్పుడు ఉద్యోగి “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు. ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు. మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!
తెలివైన కథ – Intelligent Telugu Stories
“మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.”
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com