ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ…
తాకితే సితారా… శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార… కసి పదనిస పలికేరా…
తెల్ల తెల్లని చీర… జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక… చేయమన్నాది కుంభమేళ…
ప్రేమ గురువా ఊగరావా… పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరానా…
గొడవే నిరంతరం… ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం… తకధిమి తపనే తలాంగు తోం తోం తోం
ఇంద్రధనస్సు మంచం… ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం… అది అడిగెను మరి కొంచెం…
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ…
తెల్ల తెల్లని చీర… జారుతున్నాది సందెవేళ…
ప్రియ వనిత చీర మడత… చక్కచేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా… కన్నె ఎద రాగంలా…
రగిలే గులాబివే… మదనుడి సభకే జవాబువే
తగిలే సుఖానివే… బిగువుల బరిలో విహారివే…
శోభనాల బాలా… ముందుంది ఇంక చాలా
జాజులా మజాల… పూగంధం పూయాలా…
తెల్ల తెల్లని చీర… జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక… చేయమన్నాది కుంభమేళ…
తాకితే సితారా.. శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార… కసి పదనిస పలికేరా…ఆ ఆ