Patala Pallakivai Lyrics in Telugu – పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి…
కంటికి కనపడవేం… నిన్నెక్కడవెతకాలి..?
నీతోడు లేనిదే… శ్వాసకి శ్వాస ఆడదే…
నువ్వే చేరుకోనిదే… గుండెకి సందడుండదే…
నీ కోసమే అన్వేషణ… నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి…
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి…
కంటికి కనపడవేం… నిన్నెక్కడవెతకాలి..?
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది…
తనరూపు తానెపుడూ చూపించలేనంది…
అద్దంలా మెరిసే… ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే… తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది…
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది…
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి..?
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి…
కంటికి కనపడవేం… నిన్నెక్కడవెతకాలి..?
పాదాల్ని నడిపించే… ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే… భావాల ఉనికేది…
వెన్నల దారమా… జాబిల్లిని చేర్చుమా…
కోయిల గానమా… నీ గూటిని చూపుమా…
ఏ నిముషంలో నీ రాగం… నా మది తాకింది
తనలో నన్నే కరిగించి… పయనిస్తూ ఉంది…
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది…
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి…
కంటికి కనపడవేం… నిన్నెక్కడవెతకాలి…
నీతోడు లేనిదే… శ్వాసకి శ్వాస ఆడదే…
నువ్వే చేరుకోనిదే… గుండెకి సందడుండదే…
నీ కోసమే అన్వేషణ… నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి…
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి…
కంటికి కనపడవేం… నిన్నెక్కడవెతకాలి..?
Patala Pallakivai Lyrics in Telugu – పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.