Menu Close

Telephone Dhwanila Song Lyrics In Telugu – Bharateeyudu


ఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హో
ఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హో
టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
డిజిటలలొ చెక్కిన స్వరమా
ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సైన్ తబళా నువ్వేనా

సోన సోన… నీ అందం చందనమేనా
సోనా సోన… నువు లేటెస్ట్ సెల్యులార్ ఫోనా
కంప్యూటర్ తో నిన్ను… ఆ బ్రహ్మె మలిచేనా
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ

నువు లేని నాడు ఎండే ఉండదులే… చిరు చినుకే రాలదులే
నువ్వు లేని నాడు వెన్నెల విరియదులే… నా కలలే పండవులే
నీ పేరు చెబితే శ్వాస పెదవి… సుమగంధమవును చెలి
నువు దూరమైతే… వీచే గాలి ఆగిపోవునులే
నువు లేక పోతే జరులే ఉండవులే… కొండకి అందం ఉండదులే
నువ్వు రాకపోతే ప్రాణం నిలువదులే… వయసుకి ఆకలి పుట్టదులే
నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని
సిగ్గేస్తుంటే నీ కురులతొ నిన్నే దాచేసుకో

టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ

నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
ఆ సుఖమును వదలనులే
నీ జల్లో పూలు రాలగ విడువనులే… ఆ ఎండకు వదలనులే
ఏ కన్నే గాలి నాదే తప్ప నిను తాకనివ్వను
ఏనాడూ నిన్ను మదర్ థెరిసా తో తప్ప పలుకనివ్వను

నువ్వెల్లే దారి పురుషులకొదలనులే… పర స్త్రీలను విడవనులే
నీ చిలిపి నవ్వు గాలికి వదలనులే… ఎద లోయల పదిలములే
షౌ రూముల్లో… స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వనూ

టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
డిజిటలలొ చెక్కిన స్వరమా
ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సైన్ తబళా నువ్వేనా

సోన సోన… నీ అందం చందనమేనా
సోనా సోన… నువు లేటెస్ట్ సెల్యులార్ ఫోనా
కంప్యూటర్ తో నిన్ను… ఆ బ్రహ్మె మలిచేనా

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading