అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Sinukulata Lyrics In Telugu – Telangana Folk Song, Spoorthi Jithender
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట
సినుకు ముత్యాలు నా మీద రాలుతుంటే
గుండె జారుతుంటే… కళ్ళు తిరుగుతుంటే
ఒళ్ళు వణుకుతుంటే… తోడు ఏదని ఎద పోరు పెట్టవట్టే
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట
తడి బట్ట గిలిగింత… అడివెట్టే తనువంతా
వరదల్లా బురదల్లా గంతులేసాడంగా
తడి బట్ట గిలిగింత… అడివెట్టే తనువంతా
వరదల్లా బురదల్లా గంతులేసాడంగా
సిగ్గు తెరలు తీసి… నా గుండె లోతుల్లా
కొంగొత్త ఆశలు కోలాటం ఆడంగా
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట
బొట్టు బొట్టు కలిసి… ఎత్తు ఒంపులు దాటి
పాలధారాలు గంగా ఒడిలోన పారంగా
బొట్టు బొట్టు కలిసి… ఎత్తు ఒంపులు దాటి
పాలధారాలు గంగా ఒడిలోన పారంగా
సిలిపి బండరాల్లు… సరసాలు ఆడంగా
నీటి మందారాలు… నను ముద్దులాడంగా
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట
మారాకు తొడిగిన కొమ్మలల్లకెళ్ళి… పిల్లగాలి సల్ల సల్లంగ పిలవంగా
మారాకు తొడిగిన కొమ్మలల్లాకెళ్ళి
పిల్లగాలి సల్ల సల్లంగ పిలవంగా
పచ్ఛాని పైరుల్లా వెచ్చని పొదలల్లా
పరుసుకున్న పడుసు పరువాలు మురవంగా
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
ఆ నింగి అంచున రంగులారబోసి
సింగిడి ఎంతో సుంగారం ఒలుకంగా
ఆ నింగి అంచున రంగులారబోసి
సింగిడి ఎంతో సుంగారం ఒలుకంగా
మట్టి పొత్తిళ్లలో పూసిన పువ్వులు
నా వాడి తీరుగా నవ్వులు రువ్వంగా
మిలమిల మెరిసేటి… మెరుపులటో మెరుపులటా
మెరుపుల్లో సినదాని వలపులట
సిటసిట కురిసేటి… సినుకులటో సినుకులటా
సినుకుల్లో సినదాని సిందులట