Suryude Selavani Lyrics In Telugu – సూర్యుడే సెలవని లిరిక్స్
సూర్యుడే సెలవని… అలసి పోయేనా
కాలమే శిలవలే… నిలిచిపోయేనా
మనిషి మనిషిని… కలిపిన ఓ ఋషి
భువిని చరితని… నిలిపెను నీ కృషి
మహాశయా… విధి బలై తరిమెనా
మహోష్ణమై రుధిరమే మరిగెనా
ఆగిపోయెనా త్యాగం కధా… ఆదమరిచెనా దైవం వృధా
సూర్యుడే సెలవని… అలసి పోయేనా
కాలమే శిలవలే… నిలిచిపోయేనా
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఊర్వారుక మివ బంధనాన్… మృత్యోర్ముక్షీయ మామృతాత్
స్వార్థమే పుడమిపై… పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై… ఉరక లేస్తుంటే
యుగము యుగమున… వెలిసెను దేవుడు
జగము జగములు… నడిపిన ధీరుడు
మహోదయా అది నువ్వే అనుకొని… నిరీక్షతో నిలిచె ఈ జగతని
మేలుకో రాదా… మా దీపమై
ఏలుకో రాదా… మా బంధమై.. ..
Suryude Selavani Lyrics In Telugu – సూర్యుడే సెలవని లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.