ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Subhalekha Rasukunna Lyrics – శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది మీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా… బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా… పక్కలలో
శుభలేఖ అందుకున్నా… కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా… చెలికే ఎపుడో
శారద మల్లెల పూలజల్లే… వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యలు… రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్న… ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో
చైత్రమాసమొచ్చెనేమో… చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో… గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో… మాయదారి చూపుకి
మల్లెమబ్బులాడెనేమో… బాలనీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగే… గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే… నచ్చే వన్నెలు
అంతేలే, కథ అంతేలే… అదంతేలే
హంసలేఖ పంపలేక… హింస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా… పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా… పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా… వేణుపూల తోటలో
వాలుచూపు మోసుకొచ్చే… ఎన్నో వార్తలు
ఒళ్ళో దాటి వెళ్ళ సాగే… ఎన్నో వాంఛలు
అంతేలే, కథ అంతేలే… అదంతేలే
శుభలేఖ రాసుకున్న… ఎదలో ఎపుడో
అది మీకు పంపుకున్న… అపుడే కలలో
శారద మల్లెల పూలజల్లే… వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యలు… రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్న… ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా… కలయో నిజమో..
Movie: Kondaveeti Donga (09 March 1990)
Director: A. Kodandarami Reddy
Producer: T. Trivikrama Rao
Singers: S P Balasubramanyam, KS Chitra
Music: Ilayaraja
Lyrics: Veturi Sundararama Murthy
Star Cast: Chiranjeevi, Vijayashanti, and Radha
Audio: Lable Aditya Music Telugu
Subhalekha Rasukunna Lyrics – శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో