Menu Close

Sooseki Lyrics in Telugu – Pushpa 2 – సూసేకి లిరిక్స్

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Sooseki Lyrics in Telugu – Pushpa 2 – సూసేకి లిరిక్స్

Sooseki Lyrics in Telugu – Pushpa 2 – సూసేకి లిరిక్స్

వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు.. ..

వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు…

ఓ ఓ, మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా?

సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి .. ..

హో, ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు

కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు

అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి…

హో ఓ ఓ, గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు

బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు..!

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ .. ..

Sooseki Lyrics in Telugu – Pushpa 2 – సూసేకి లిరిక్స్

Q: Who is the singer of the song “Sooseki” from the movie “Pushpa 2”?
A: Shreya Ghoshal is the singer of the song “Sooseki.”

Q: Who composed the music for the song “Sooseki”?
A: The music for the song “Sooseki” was composed by Devi Sri Prasad.

Q: Who wrote the lyrics for the song “Sooseki”?
A: The lyrics for the song “Sooseki” were penned by Chandra Bose.

Q: Who are the lead actors in the movie “Pushpa 2”?
A: Allu Arjun and Rashmika Mandanna are the lead actors in the movie “Pushpa 2.”

Q: In which movie does the song “Sooseki” appear?
A: The song “Sooseki” is featured in the movie Pushpa 2.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading