SMART Technique to Win – విజయం సాధించడానికి అద్భుతమైన టెక్నిక్
గాడిద రోజంతా కష్టపడిన అడవికి రాజు కాలేదు, సింహం గుహలో కూర్చుంటే ఆడ సింహాలు వేటాడి ఆహారాన్ని తీసుకొస్తాయి. ఇక్కడ నీతి అతిగా కష్టపడటం వలన కూడా విజయం రాదు. ఒక మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయే కార్లు రోజుకు వందల్లో ఉత్పత్తి అవుతాయి. రోల్స్ రాయ్స్, బెంట్లీ వంటి కార్లు రోజుకు రెండు మాత్రమే తయారవుతాయి.

ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఈ సూత్రం ఫాలో అవ్వండి.
Specific: మీరు చెయ్యబోయే పని క్లుప్తంగా స్పష్టంగా ఉండాలి. ఏం అవుదాం అనుకుంటున్నారో దానికోసమే ప్రయత్నించాలి. ఒకేసారి రెండు పడవల ప్రయాణం, నిర్దిష్టత లేని ఆలోచన మనల్ని మరింత కిందకి లాగుతాయి. ఎలన్ మస్క్ కేవలం ఎలక్ట్రికల్ కార్లను మాత్రమే తయారుచేస్తాడు.
Measurable: పని కొలవగలిగేది అయ్యుండాలి. రోజుకి మీ సామర్ధ్యం 20 పనులు చెయ్యగలిగేది అయితే 100 పనులకు కేటాయించాకూడదు. హార్లే డేవిడ్సన్ బైక్ రోజుకు రెండే ఉత్పాదన చేసినా అందుకు తగ్గట్లు వారి ధర కూడా అధికంగానే ఉంటుంది.
Attainable: చెయ్యగలిగే పని అయ్యుండాలి. చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటివి కాకుండా అందరికి అందుబాటులో, అవసరం అయ్యుండే పనిని ఎంచుకోవాలి.. సులభాతరానికి అసాధ్యానికి మధ్యలో మాన పని ఉండాలి.
Relevant: చేసే పని అందరికి సంబందించినది అయ్యుండాలి. రాకెట్ సైన్సు, బ్లాక్ హోల్స్ అందరికి వివరించలేం కానీ కార్, బైక్ పని తీరుని వివరించగలం. అలా మనం చేసే పని కస్టమర్ కి సంబందించినది కావాలి.
Timebound: పని సమయానికి నిర్దిస్టిoచబడి ఉండాలి. అంటే మీరు ఒక పని చెయ్యడానికి 8 గంటల సమయం తీసుకుంటే ఆ సమయలోనే చేసి తీరాలి. అలా కాకుండా దీర్గసమయం, దీర్గ లాభాల ఆలోచనలు అంతగా ఎవ్వరిని ఆకర్షించవు.
SMART Technique to Win – విజయం సాధించడానికి అద్భుతమైన టెక్నిక్