అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Siluva Chentha Cherina Naadu Lyrics In Telugu – Telugu Christian Songs
సిలువ చెంత చేరిన నాడు… కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను… సిద్ధపడిన భక్తుల జూచి
సిలువ చెంత చేరిననాడు… కలుషములను కడిగివేన్
పౌలు వలెను సీల వలెను… సిద్ధపడిన భక్తుల జూచి
కొండలాంటి బండలాంటి… కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు… మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన… పిలుచుచుండె పరముచేర ||2||
సిలువ చెంత చేరిననాడు… కలుషములను కడిగివేన్
వంద గొర్రెల మందలో నుండి… వంద గొర్రెల మందలో నుండి
ఒకటి తప్పి ఒంటరియాయె… ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొర్రెల విడచి… ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||2||
సిలువ చెంత చేరిననాడు… కలుషములను కడిగివేన్
తప్పిపోయిన కుమారుండు… తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయె… తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగి రాగా… తండ్రియతని జేర్చుకొనెను ||2||
సిలువ చెంత చేరిననాడు… కలుషములను కడిగివేన్
పాపిరావా పాపము విడచి… పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా… పాతాళంబే వారి యంతం ||2||
సిలువ చెంత చేరిననాడు… కలుషములను కడిగివేన్
పౌలు వలెను సీల వలెను… సిద్ధపడిన భక్తుల జూచి