Shanmukh Rukmini Lyrics In Telugu – Folk Song
గుండెల్లోన గుడికట్టి దాసుకుంటానే
నెత్తిమీద పెట్టూకోనీ సూసుకుంటానే
మందిలెక్క కాదు నేను
మదిల నిన్ను నిలుపుకున్ననే
సిటికెనేలు పట్టుకుంటనే రుక్మిణి
నీతో సివరిదాక ఉంటనే ఓ రుక్మిణీ
తులసిదళం ఏత్తె సాలు తూగే కిట్టమూర్తిని
సిటికెనేలు పట్టుకుంటనే రుక్మిణి
నీతో సివరిదాక ఉంటనే ఓ రుక్మిణీ
పుట్టినసంది నీమీద మనసు పడితిరో
మనసు మీద మన్నుపోసి పట్నం పోతివిరో
దూరముంటే ఎంత భారమైద్ధో
నువ్వు తెలుసుకోవురో
సిటికెలేసి సెప్పుతున్నది రుక్మిణి
నిన్ను పుటుక్కుమాని తెపుతుంటది రుక్మిణీ
దేన్ని సేసుకుంటవో నువు.. సూత్త నన్ను కాదని
సిటికెలేసి సెప్పుతున్నది రుక్మిణి
నిన్ను పుటుక్కుమాని తెపుతుంటది రుక్మిణీ
నా పర్సు తెర్సి సూడే నీ ఫొటో దాసుకున్న
నా పుస్తకాల నిండా నీ పేరు రాసుకున్న
ఎండి బిళ్ళ జేసి నిన్ను… నా మెళ్ళ ఏసుకున్న
నీకోసం ఎదురు సూస్తు… గల్మకాడ కుసోనున్న
మల్లొచ్చే ఏడుగాని… నా సదువు పూర్తి కాదే
ఉద్యోగం ఇట్ల రాని… అట్ల నీకు పుస్తె కడ్తనే
సిటికెనేలు పట్టుకుంటనే రుక్మిణి
నీతో సివరిదాక ఉంటనే ఓ రుక్మిణీ
జర నవ్వరాదే తెరిసి నీ బుజ్జి బుంగమూతిని
సిటికెనేలు పట్టుకుంటనే రుక్మిణి
నీతో సివరిదాక ఉంటనే ఓ రుక్మిణీ
నీ కొలతలిచ్చి కొత్త అంగీలాగులు కుట్టించిన
కైకిలి పైసలతోటి బంగారు గొలుసు కొన్న
యెహె, దోస్తులతో తిరుగుతున్న నీ మీద ప్రాణముందే
పస్తులతో పండుకున్న నా ప్రేమ సావకుందే
ఆడ నువ్వు ఈడ నేను… ఎన్ని నాళ్ళు బావ
కలోగంజో తాగుదాము… కలిసి ఉండలేవా
సిటికెనేలు పట్టుకుంటది రుక్మిణి, ఏయ్
నీతో సివరిదాక ఉంటది ఈ రుక్మిణీ
ఏడు అడుగులేసి నీతో పంచుకుంట జన్మని
సిటికెనేలు పట్టుకుంటది రుక్మిణి, ఏయ్
నీతో సివరిదాక ఉంటది ఈ రుక్మిణీ