ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Seetharamula Kalyanam Choothamu Rarandi Lyrics In Telugu
సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి… నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
ఆ ఆ ఆఆ ఆఆ ఆ… పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వి… కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి… నామము దీర్చి
చెంపజవాజి చుక్కను పెట్టీ… ఆ ఆఆఆ ఆఆ ఆఆ
చెంపజవాజి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై… కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై… నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి