ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Seetha Seemantham Lyrics in Telugu – Sri Rama Rajyam
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే
కోసల దేశమే మురిసి కొయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే
మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ ఔతోంది
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే
అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే
అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే
కాశ్మీరామే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంపే
కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే
అరేయ్ వద్దు వద్దు అంటున్న ముగ్గురు అక్కలు కూడి ఒక్క పని చెయ్యనివ్వరే
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే
పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడుపోసినట్టు జరుగులే
మెట్టినింటి వారు నేడు పట్టరాని సంబరంతో పసుపు కుంకుమ ఇచ్చినట్టులే
రామ నామ కీర్తనలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే
అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లి బిడ్డలు ఇల్లు చేరులే
ముత్తయిదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే
అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమె
ఎక్కడున్ననూగాని చక్కనైన కల్యాణి రామ రక్షా నీకు ఎప్పుడూ
దేవి సీమంతం సంతసాల వంతపాడేనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
అంగనలందరు కలిసి కోమలి కి మంగళ హారతులనిరే
వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనలొసగే
శుభ యోగాలతో
వెలిగే సాగే సుతుని కనవమ్మా
దేవి సీమంతం సంతసాల వంతపాడేనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
Seetha Seemantham Lyrics in Telugu – Sri Rama Rajyam