Menu Close

Sarkaru Vaari Paata Review and Story in Telugu

Sarkaru Vaari Paata Review in Telugu

విడుదల తేదీ : మే 12, 2022
దర్శకత్వం : పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

Sarkaru Vaari Paata Review and Story in Telugu

Sarkaru Vaari Paata Story in Telugu

మహేష్ యూఎస్‌లో లోన్ రికవరీ బిజినెస్ చేస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా డబ్బు విషయంలో మహేష్ ఎంతో కచ్చితంగా ఉంటాడు. అలాంటి మహేష్ ను మోసం చేసి కళావతి అతని దగ్గర అప్పు తీసుకుంటుంది. డబ్బు తిరిగి చెల్లించకుండా చీట్ చేస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కళావతి తండ్రి రాజేంద్రనాథ్ ను కలుస్తాడు మహేష్.

రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ మెలిక పెడతాడు. ఈ క్రమంలో కథ మలుపు తిరుగుతుంది. అసలు మహేష్ టార్గెట్ ఏమిటి? ఇంతకీ ఎవరు ఈ రాజేంద్రనాథ్? మహేష్ అతన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు మహేష్ ఇదంతా దేని కోసం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ఈ సినిమాను ఒన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేశ్ మాత్రం జీవించేశాడు. మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో మహేశ్ ఎనర్జీ కూడా సూపర్బ్ అనిపించింది. కీర్తి సురేశ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తన అందాలను ఆరబోసింది.

Sarkaru Vaari Paata Review and Story in Telugu

కమెడియన్ గా వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడు. సముద్రఖని.. తన విలనిజాన్ని పండించాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాకు ముందే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు స్క్రీన్ మీద మరింత బెస్ట్ గా కనిపించాయి. ఓవర్ ఆల్ గా సినిమాను పరుశరామ్.. అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త మహేశ్ బాబును పరిచయం చేశాడు.

ప్లస్ పాయింట్స్
సినిమాకు ప్లస్ పాయింటే మహేశ్ బాబు, ఆయన లేని సినిమాను ఊహించలేం.. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ లో బాగా చేశారు..
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది,
స్క్రీన్ ప్లే,
కామెడీ,
హీరోయిన్ కీర్తి బాగా చేశారు.

మైనస్ పాయింట్స్
ఈ సినిమాకు ఎడిటింగ్ మైనస్ పాయింట్.. రొటీన్ స్టోరీ లైన్.. మాస్ ఫార్ములా.

ఈ సినిమా మీకెలా అనిపించింది ఒక కామెంట్ చెయ్యండి

Sarkaru Vaari Paata Review and Story in Telugu, Sarkaru Vaari Paata HD Images, Sarkaru Vaari Paata OTT Release Date, Sarkaru Vaari Paata Movie Online Free

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading