ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులే
నా జతలో నీ అందం
వందేళ్ళపాటు వెండి వెన్నెలే
నా హార్టు బీటులో ధ్వని
ఇవ్వాలిలాగ ఉందని
మొజార్ట్ చేతి వేళ్ళు కూడా
చూపించనే లేవులే
ఈ క్షణాన నాలో కాంతిని
ఏ మీటరయినా ఇంతని
లెక్కించి చెప్పలేను అసలే
సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)
సంబరమే (చెలియా యు ఆర్ మై లవ్)
సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)
ఓ వరమై వరమై నన్ను కలిసావే
సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్
నా చిరునవ్వులేవి తారాజువ్వలై
రివ్వంటున్నవి కన్నా ఆ ఆ
నా సిరిమువ్వలేవి గాల్లో గువ్వలై
ఆడే సవ్వడి వింటున్నా
చెలియా యు ఆర్ మై లవ్
తీరని స్వప్నాలు… తీర్చిన వెలుగు నువ్వు
మెరిసెనురా కన్నూ
ఆమని రంగులను మనసున నింపావు
వదలకురా నన్నూ
చెలియా యు ఆర్ మై లవ్
చెలియా యు ఆర్ మై లవ్
ఓఓఓఓ ఓఓఓఓ
పరిచయం జరిగెనో లేదో
మరుక్షణం ప్రేమలో తేలేనే ప్రాణం
కనీవినీ ఎరుగని పరవశం నన్ను కమ్మగా
కమ్మెనే ఈ తరుణం
ముందే ముందే నువ్వున్నావా నాలో
ఏమో ఉన్నావేమో ఊపిరిలో
నేడే నిన్ను చూస్తున్నానా నాలో
కలనయా వాస్తవంలో
సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్