Menu Close

Alupannadi Unda Song Lyrics In Telugu – Gayam-1993

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకు
అదుపన్నది ఉంద… కలిగే కలకు, కరిగే వరకు
మెలికలు తిరిగే… నది నడకలకు
మరి మరి ఉరికే… మది తలపులకు… లల లల లలలలా
అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకు
అదుపన్నది ఉంద… కలిగే కలకు, కరిగే వరకు

నా కోసమే చినుకై కరిగి… ఆకాశమే దిగద ఇలకు
నా సేవకే సిరులే చిలికి… దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు… బహుమతి కావా..! నా ఊహలకు
కలలను తేవా… నా కన్నులకు… లల లల లలలలా

అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకు
అదుపన్నది ఉంద… కలిగే  కలకు, కరిగే వరకు

నీ చూపులే తడిపే వరకు… ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు… ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల… తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే… తొలి ఆశలకు… లల లల లలలలా

అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకు
అదుపన్నది ఉంద… కలిగే  కలకు, కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే… మది తలపులకు… లల లల లలలలా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading