ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Saktinivvu Lyrics in Telugu – Baba
మే మడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు…. శక్తినివ్వు….
దేవా…. దేవా… తల్లివి నీవే తండ్రివి నీవే
ప్రణవము నీవే ప్రాణము నీవే ||తల్లివి||
రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు
భువిని గెలుచుటకు శక్తినివ్వు
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు ||నే||
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు
తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు
తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు
కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు
నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు ||తల్లివి||
బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను
ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను (౨)
నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను
మద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించబోను
దేవా…దేవా… ||తల్లివి||