Menu Close

Sai Saranam Baba Saranam Lyrics In Telugu – Sri Shirdi Sai Baba Mahathyam

Sai Saranam Baba Saranam Lyrics In Telugu – Sri Shirdi Sai Baba Mahathyam

హే..! పాండురంగా
హే..! పండరి నాథా
శరణం శరణం శరణం

సాయీ శరణం… బాబా శరణం శరణం
సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే

సాయీ శరణం
బాబా శరణం శరణం
సాయీ చరణం
గంగా యమున సంగమ సమానం

విద్యా బుద్ధులు వేడిన బాలకు
అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని
కరుణించాడు సర్వేశ్వరుడై

తిరగలి చక్రం తిప్పి వ్యాధినే
అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను
మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని
దర్శనమిచ్చాడు, ధన్యుల జేసాడు

సాయీ శరణం… బాబా శరణం శరణం
సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే
సాయీ శరణం… బాబా శరణం శరణం
సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం

పెను తుఫాను తాకిడిలో
అలమటించు దీనులను
ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న… అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై

వీధి వీధి బిచ్చమెత్తి
వారి వారి పాపములను పుచ్చుకొని
మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను
ప్రక్షాళన చేసికొనెను

దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి
ఖండయోగ సాధనలో
ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం… సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం… సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం

సాయీ శరణం… బాబా శరణం శరణం
సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు… కరుణామయుడు సాయే

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading