Sadi Seyako Gaali Lyrics In Telugu – Raja Makutam
మ్ మ్ మ్ మ్, స్స్ స్స్
సడిసేయకో గాలి… సడి సేయబోకే
సడిసేయకో గాలి… సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే
రత్నపీఠిక లేని… రారాజు నా స్వామి
మణికిరీటము లేని… మారాజు గాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే
సడి సేయకే
ఏటి గలగలలకే… ఎగసి లేచేనే
ఆకు కదలికలకే… అదరి చూచేనే
నిదుర చెదిరిందంటే నేనూరుకోనే
సడి సేయకే
పండువెన్నెలనడిగి… పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు… నిదుర తేరాదే
విరుల వీవనపూని… విసిరి పోరాదే
సడిసేయకో గాలి… సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడిసేయకో గాలి, ఓ ఆ ఆఆ ఆ ఆఆ మ్ మ్
Like and Share
+1
1
+1
1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.