Menu Close

Saadhaaram Naaku Aadhaaram Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Saadhaaram Naaku Aadhaaram Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా      ||ఆధారం||

భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2)         ||ఆధారం||

రచయిత: బొనిగల బాబురావు

Saadhaaram Naaku Aadhaaram Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading