ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక భార్యకు ఒక భర్త. ఒక భర్తకు ఒక భార్య. ఈ నీతిని తప్పిన వారు మగ అయినా, ఆడ అయినా అది అక్రమ సంబంధమే. మీరు ప్రశ్న ఆడవారి పరంగా అడిగారు కాబట్టి ఆ కోణంలోనే చూద్దాం.
చిత్త చాపల్యం వల్ల అక్రమ సంబంధం కోరుకుంటారు కొందరు. అవతలి వారిలో అందం ఎక్కువనో, తన అవసరాలకు ఉపయోగ పడతారనో అక్రమ సంబంధాలకు ఒడిగడతారు. అవతలి వ్యక్తి చాతుర్యంగా మాట్లాడినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
కొందరు ఉద్యోగ, ఉపాధి అవసరాలు ఆసరా చేసుకుని అక్రమ సంబంధానికి లోబడతారు. పేదరికం వల్ల కొందరు, జల్సాలకోసం మరి కొందరు ఇలాంటి పని చేస్తారు. ప్రచార, వినోద మాధ్యమాల ప్రభావం కూడా ఓ కారణం. చెడు స్నేహాలు కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తాయి.
కారణం ఏదైనా, అసహజ సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, కక్షలకు దారితీస్తాయి. ఈ కారణంచేతే, దేశంలో ప్రతిరోజూ నాలుగు వందలు పైగా నేరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజూ కనీసం15 మంది హత్య, ఆత్మహత్యల పాలవుతున్నారు.
అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కసాయి తల్లి, తండ్రులు తమ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఓ మతప్రచారకుడు, ప్రచారకురాలు అక్రమ సంబంధం బయట పడుతుందని, ఓ అమాయకురాలిని కడతేర్చారు. రెండున్నర దశాబ్దాల తర్వాత, ఇటీవల హంతకులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ఇలాంటి ఘటనలకు కుల, మత, ప్రాంత భేదం లేదు.
తప్పు చేసేప్పుడు తీయగా ఉంటుంది. శిక్ష అనుభవిస్తున్నపుడు బాధగా వుంటుంది. ఇలాంటి దుష్పరిణామాలు ఉండకూడదు అనే భారతీయ సంస్కృతి సీతారాముల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అంటోంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com