ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
టాప్ 50 రియాలిటీ కోట్స్ – Reality Quotes in Telugu
తప్పు చేస్తే, దానికి
“కారణాలు” చెప్పే నువ్వు,
ఇతరులు తప్పు చేసినప్పుడు
“నీతులు” చెప్పకు.
ఆపదలకి మూలం
“అజాగ్రత్త”
పతనానికి మూలం
“అహంకారం”
తనలో చేరే
అన్నింటిని కుళ్లిపోయేలా చేసే
ఈ భూదేవి తల్లి
విత్తనాలకు మాత్రం ప్రాణం పోస్తుంది.
ఇదే సృష్టి ధర్మం అనుకుంటా..
నిజం కూడా..
ప్రతి రోజు ప్రచారంలో ఉండాలి.
లేదంటే, కొద్ది రోజులకు
అబద్ధమే నిజంలా మారి
ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.
మీలోని కళలని మీలోనే దాచుకుని,
శాశ్వతంగా..
సమాధుల్లో నిద్రించడానికి వెళ్ళకండి.
అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.
“భార్య”
తన భర్తకి విధించే
అతి పెద్ద శిక్ష ఎంటో తెలుసా..?
భర్త కన్న ముందే
తను చనిపోవడం.
మూర్ఖత్వానికి
వయస్సుతో పనిలేదు.
70 ఏళ్ల మూర్ఖులు వున్నారు.
20 ఏళ్ల జ్ఞానులు వున్నారు.
చావు ఏ క్షణంలోనైనా రావొచ్చు
అని తెలుసుకున్నవాడే
ప్రతినిమిషం ఆనందంగా బతకగలడు.
మనకు జీవితంలో సమస్యలు లేకపోతె
బోర్ కొట్టి చచ్చిపోవడం ఖాయం.
ఒక మనిషికి సాయం చేయడంలో ఇబ్బంది ఏంటంటే,
అతనికి మళ్ళీ సాయం కావాల్సినపుడు మనమే గుర్తొస్తాం.
వాళ్లిద్దరూ..
ఎంతగానో ప్రేమించుకున్నారు,
కానీ తరువాత
సంతోషంగా బతకలేకపోయారు.
కారణం, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.
మీరెప్పుడైతే
మీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటారో…
మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది.
నీలో ఉన్నశక్తి తెలియనంత వరకు
నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది.
తెలుసుకున్న తరువాత
నువ్వు అందరికి కొండలా కనిపిస్తావు.
ఇండియా నుండి
పాకిస్తాన్, బంగ్లాదేశ్
విడిపోయి వుండకపోయుంటే
ఈ పాటికి “ఇండియా” కూడా
ఓ ముస్లిం దేశం అయ్యి ఉండేదని
చాలామంది అభిప్రాయం.
మీరేమంటారు..?
చెప్తేకానీ, అర్థంచేసుకోని వాళ్ళతో
బ్రతకడం “కష్టం”.
చెప్పినా.. అర్థం చేసుకోని వాళ్ళతో
బ్రతకడం “నరకం”.
పోనీరా వెధవ మనసు
అది వున్న కొద్దీ
మనిషికి బాధే కానీ హాయి లేదు.
ఈ లోకంలో సుఖపడే వాళ్లంతా
హృదయం లేని వాళ్ళేరా..
అసలు నన్ను అడిగితే
ఈ లోకానికే హృదయం లేదు.
ఒక పురుషుడితో..
ఆనందంగా జీవించాలంటే,
అతనిని ప్రేమించడం కంటే,
అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఒక స్త్రీతో..
ఆనందంగా జీవించాలంటే,
ఆమెను అర్థం చేసుకోవడం కంటే,
ఆమెను ప్రేమించడం ముఖ్యం.
జీవితంలో ఎప్పుడూ
ఒకరిని మర్చిపోయేందుకు
ఇంకొకరిని వాడుకోవద్దు.
ఈ సమాజంలో మనుషులు
నిన్ను చాలా రకాలుగా
బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు.
నువ్వు కూడా,
వాటన్నిటిని తప్పించుకుని
మరిన్ని రకాలుగా
ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు.
నువ్వు ఎందుకు
ఇలా మారిపోయావు
అని నన్ను ప్రశ్నించేముందు,
నిన్ను నువ్వు ప్రశ్నించుకో,
నేను ఇలా మారపోవడానికి
నువ్వు ఏమ్ చేసావో..
నేటి సమాజంలో
అవసరం ఉన్నపుడు
నువ్వే అంతా అంటారు.
అవసరం తీరాక
నువ్వెంత అంటారు.
నీ చేతిలో రూపాయి
లేనప్పుడు కూడా
నలుగురిలో నీకున్న విలువ
నీ అనుకున్న వాళ్లు
నీపై చూపించే ప్రేమే
నీ నిజమైన ఆస్తులు.
తండ్రి తన బిడ్డల కోసం
కోట్లు కూడబెట్టడం కంటే
కష్టపడి పనిచేసే తత్వం
అలవాటు చేస్తే
వాళ్లు జీవితంలో
ఉన్నత స్థాయికి వెళ్తారు..!
ఎవరికి ఎంత చెప్పాలో
అంతే చెప్పాలి..
వినకపోతే వదిలేయాలి.
వాళ్ళే తెలుసుకుంటారు.
దెబ్బ తగిలితేనే కదా
నొప్పి విలువ తెలిసేది.!
అందలం ఎక్కించమని
ఏ భార్య కోరుకోదు.
అందరిలో..
చులకన చెయ్యొద్దని
మాత్రమే కోరుకుంటుంది.
ఆడపిల్ల పుట్టింట్లో
20 సంవత్సరాలు
మాత్రమే వుంటుంది.
కానీ అత్త వారింట్లో
పూర్తి జీవితం గడపాలి.
అలాంటి ఇల్లు ఆమెకు
గుడి కాకపోయినా
పర్లేదు కానీ జైలు కాకూడదు.
ఆడపిల్ల పుట్టింట్లో
ఎంత గొప్పగా పెరిగినా
ఆమె అదృష్టం, దురదృష్టం
తెలిసేది ఆమె పెళ్లి తరవాతే.
నీ కష్టాలకు, బాధలకు
గజ్జెలు కట్టి
అందరికి వినిపించకు.
ఇక్కడ వినేవారికంటే
నవ్వే వారే ఎక్కువ.
మనిషే అంత..
బంధం బాగున్నప్పుడు
అందరి విషయాలు
నీకు చెప్తారు.
అదే బంధం చెడినప్పుడు
నీ విషయాలు అందరికి చెప్తారు.
మనం పుడితే
తల్లి సంతోషపడాలి.
పెరిగితే తండ్రి గర్వపడాలి.
బతికితే సమాజం ఇష్టపడాలి.
చస్తే శత్రువు కూడా
కన్నీరు పెట్టాలి.
అది జీవితమంటే..
అందరికీ
“శత్రువులానైనా” బ్రతుకు..
కానీ ఎవ్వరికీ “బానిసలా”
మాత్రం బ్రతకకు.
అవసరాలు..
అడిగేలా చేస్తాయి
అత్యవసరాలు..
అడుక్కునేలా చేస్తాయి.
సొమ్ములతోనూ,
సమయంతోనూ
అప్రమత్తంగా ఉన్నప్పుడే..
అవసరాలనేవి..
పలకరించినట్టు ఉంటాయి,
లేదంటే
అత్యవసరాలై.. పరిగెత్తిస్తాయి..!
నువ్వు సంపాదించే దాని కంటే
తక్కువ ఖర్చు పెట్ట గలిగితే..
నీ జీవితంలో నీకు ఎప్పుడు
ఆర్థిక ఇబ్బందులు వుండవు.
పగటిపూట నిద్ర వస్తుందంటే
శరీరము బలహీనంగా ఉందని అర్థం.
రాత్రిపూట నిద్ర రావడం లేదంటే
మనస్సు బలహీనంగా ఉందని అర్థం.
అన్నింటినీ తట్టుకోవడమే కాదు
కొన్నింటి నుంచి నువ్వు
తప్పుకోవడం నేర్చుకున్నప్పడే
జీవితంలో సంతోషంగా ఉండగలం.
“సోమరితనం”
మనదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద రోగం.
దానిని పెంచి పోషించేది ప్రభుత్వాలే..
ద్వేషం చాలా భారమైనది.
దాన్ని ఎంత తొందరగా
వదిలించుకుంటే
మీరు అంత ఆనందంగా ఉండగలరు.
ఎంత గొడవ పడ్డా
తినడానికి రండి
అని పిలిచే భార్య.
నువ్వు తిన్నావా..!
అని అడిగే భర్త ఉన్నోళ్లు.
అదృష్టవంతులు..!
భాధ్యత అనేది
వయసును బట్టి
వచ్చేది కాదు.!
ఇంట్లో పరిస్థితిని బట్టి
మనం తీసుకోవాల్సింది.
విచిత్ర లోకమిది.
ఒక్కడివే ఏడవాలి.
అందరిలో ఏడిస్తే నాటకం అంటారు.
నలుగురితోనే నవ్వాలి
ఒక్కడివే నవ్వితే పిచ్చి అంటారు.
చేతి నిండా డబ్బున్నప్పుడు
నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు.
రూపాయి కూడా చేతిలో లేనప్పుడు
ప్రపంచం నిన్ను మర్చిపోతుంది.
మిత్రమా జర భద్రం…
నీ గురించి
అన్ని తెలిసినవాడే..
నిన్ను దారుణంగా
మోసం చేస్తాడు.
ఈ సమాజంలో బ్రతకాలంటే..
మంచితనం, మొండితనం
ఈ రెండూ నీలో ఉండాలి.
మంచితనం మనుషుల మీద చూపించాలి.
మొండితనం పరిస్థితుల మీద చూపించాలి.
టీచర్ చేతుల్లో బెత్తం వద్దన్న సమాజం
పోలీస్ చేతిలో తుపాకీ కోరుకుంటుంది.
అదే టీచర్ చేతిలో బెత్తం ఉంటే
ఈ పోలీస్ తుపాకి పట్టుకోవాల్సిన
అవసరం ఉండదు.
ఈరోజుల్లో..
అప్పు ఇవ్వడం వల్ల
డబ్బయినా పోగొట్టుకుంటాం.
లేదంటే, కొత్త శత్రువునైనా
సంపాదించుకుంటాం..!
ఉన్నంతలో బతికేవాడు
ఎప్పుడూ..
ఉన్నతంగానే ఉంటాడు.
ప్రెస్టేజీకి పోయేవాడే
పక్కదారులు పట్టి
పాతాళానికి పోతాడు.
చెప్పులు లేవని ఏడ్చేవాడికి
కాళ్లు లేనివాడు కనిపించే వరకూ
అర్థం కాదట..
తాను ఎంతో అదృష్టవంతుడినని.