అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో జరిగిన సంగటన – పొలిటికల్ స్టోరీస్ – Political Stories in Telugu
మా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో జరిగిన సంగటన ఇది, అప్పుడు అర్దం కాకపోయినా ఇప్పుడు ఆ పరిస్తితిని తలుచుకుని తెలుసుకున్న నీతి ఇది. అప్పుడు ఆవేశం ఇప్పుడు ఆలోచన.

మా హాస్టల్లో మొత్తం 100 మంది విద్యార్థులు వుండేవారు, మాకు ప్రతి రోజూ ఉదయం టిఫిన్ గా ఉప్మా పెట్టేవాళ్ళు.
మాలో 80 మంది రోజూ ఉప్మా కాకుండా వేరే ఏదైనా టిఫిన్ పెట్టమని అడిగారు.
కానీ నాతో పాటు 20 మంది ‘ఉప్మా అయినా ఫరవాలేదు’ అన్నాము.
80 మంది మాత్రం ఉప్మా కాకుండా వేరే ఏదైనా టిఫిన్ పెట్టమని ఒత్తిడి చేసారు.
చేసేదేంలేక, మా వార్డెన్ ఏ టిఫెన్ కావాలో తేల్చుకోమని ఓటింగ్ పెట్టాడు.
‘ఉప్మా అయినా ఫరవాలేదు’ అని అనుకున్న మా 20 మంది ఉప్మాకే ఓటేసారు.
మిగిలిన 80 మంది ఇలా ఓటేశారు,
18 మంది మసాలా దోసె ,
16 మంది వడ,
14 మంది చపాతీ కుర్మా,
12 మంది బ్రెడ్ బటర్,
10 మంది నూడుల్స్,
10 మంది ఇడ్లీ సాంబార్.
మెజారిటీ కోరిక మేరకు, తరవాతి రోజుల్లో కూడా ఉప్మానే ఉపాహారంగా కొనసాగించారు.
తెలిసిన నీతి: 80% మంది విడిపోయి, తమతమ ఇష్టాలకు తగ్గట్లు ప్రవర్తిస్తే, 20% కలిసి ఐక్యమత్యంగా తమ బలాన్ని నిలుపుకున్నారు.
రాజకీయ కోణం: 80% మంది విడిపోయి తమ ఇష్టలాకు తగ్గటుగా ఓటేస్తే, 20% మంది కలిసి ఎన్నుకున్న నాయకులు మనల్ని పాలిస్తున్నారు
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com