Menu Close

Ranga Ranga Rangasthalaana Song Lyrics In Telugu – Rangasthalam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

రంగా రంగా… రంగస్థలానా… ఆ ఆ ఓ ఓ ఓ
రంగా రంగా… రంగస్థలానా… ఓఓఓ ఓ ఓ హో

రంగా రంగా రంగస్థలానా… రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా
(ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా)

ఏయ్… రంగా రంగా రంగస్థలాన… ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంటా.. మనమంతా తోలు బొమ్మలం అంటా
(ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా)

కనపడని సెయ్యేదొ ఆడిస్తున్నా… ఆట బొమ్మలం అంటా
వినపడని పాటకి సిందాడేస్తున్నా… తోలుబొమ్మలం అంటా
డుంగురు డుంగురు డుంగురు… డుముకో డుంగురు డుంగురు డుంగురు
హెయ్… డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు…

రంగా రంగా రంగస్థలానా… రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా
(ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా)

గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా… గాలంటే హనుమంతుడి నాన్నా గారటా
గాలి పీల్చడానికైన, గొంతు తడవడానికైన… వాల్లు కనికరించాలంటా

వేణువంటె కిట్టమూర్తి వాద్యం అంటా…
శూలమంటే కాళికమ్మ ఆయుధమంటా…
పాట పాడడానికైన… పోటు పొడవడానికైన
వాల్లు ఆనతిస్తేనె… అన్ని జరిగేనంటా

రంగా రంగా రంగస్థలానా… రంగు పూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా
(ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా)

డుంగురు డుంగురు డుంగురు… డుముకో డుంగురు డుంగురు డుంగురు
హెయ్… డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు…

పది తలలు ఉన్నోడు రావణుడంటా…
ఒక్క తలపు కూడ… చెడు లేదే రాముడి కంటా…
రామ రావణుల బెట్టి… రామాయణం ఆట గట్టి
మచిచెడుల మద్య మనని పెట్టారంటా…

ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా…
దయలేని వాడు యమధర్మరాజటా…
వీడి బాట నడవకుంటె… వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట…

రంగా రంగా రంగస్థలాన…
ఆడడానికంటె ముందు… సాధనంటు సెయ్యలేని
ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా
(ఆట బొమ్మలం అంటా… మనమంతా తోలుబొమ్మలం అంటా)

డుంగురు డుంగురు డుంగురు… డుముకో డుంగురు డుంగురు డుంగురు
హెయ్… డుంగురు డుంగురు డుంగురు డుముకో
డుంగురు డుంగురు డుంగురు… హొయ్యా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading